Homeహెల్త్‌Kidney Stones: కిడ్నీల్లో...

Kidney Stones: కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా? అయితే ఈ నీరు మీకు దివ్యౌషధం..

Kidney Stones: ప్రతి ఒక్కరు కూడా నీరు తాగడం చాలా అవసరం. శరీరానికి తగినన్ని నీటిని అందించడం వల్ల చాలా సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. నీరు సరిగ్గా తాగకపోవడం కిడ్నీలు ఒత్తిడికి గురవుతాయి.. దీనివల్ల శరీరంలోని విసర్జక పదార్థాలు మూత్ర నాళంలో చిన్నపాటి రాయి మాదిరి తయారవుతాయి. ఇలా తయారు కావడాన్నే కిడ్నీలో స్టోన్లు వచ్చాయి. రాళ్లు వచ్చాయి అంటారు. అయితే కిడ్నీ సమస్యల నుంచి బయట పడాలంటే నీరు తగినంత ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నీరు చాలా ఉపయోపడతుంది. అదేంటో తెలుసా?

మూత్రనాళంలో కిడ్నీ స్టోన్స్ వస్తే యూరిన్ వెళ్లే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. స్టోన్ సైజ్ పెద్దగా ఉంటే విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. చిన్నపాటి రాళ్లు అయితే ట్యాబ్లెట్స్, వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిని బయటకు పంపేయవచ్చు. కానీ సైజ్ పెద్దగా పెరిగితే మాత్రం కొన్ని సార్లు శస్త్ర చికిత్స కూడ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కిడ్నీలోని రాళ్ల సమస్యకు కొబ్బరి నీళ్ల అద్భుత ఔషధమని అంటున్నారు నిపుణులు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ కొబ్బరి నీరు. ఇది కిడ్నీలో రాళ్లను నివారించి శరీరంలోని కొన్ని సమస్యలను నివారిస్తుంది.

కొబ్బరి నీరులో పొటాషియం, మెగ్నీషియం, సోడియంతో సహా ఎలక్ట్రోలైట్లు ఎక్కువ ఉంటాయి. శరీరంలోని ద్రవాలను నియంత్రించి మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో ప్రోటీన్లను యాక్టివ్ చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడతాయి. వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఖనిజాలు, లవణాల గట్టి నిక్షేపాలు కిడ్నీ స్టోన్స్ . కొబ్బరి నీళ్లు తాగడం వల్ల టాక్సిన్స్‌ను బయటకు పంపవచ్చు. క్రియేటినిన్ స్థాయిలను తగ్గిస్తే స్ఫటికీకరణను నిరోధించవచ్చు. ఇది కొబ్బరినీరు వల్ల సాధ్యం అవుతుంది. కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మూత్రం పలచగా వస్తుంది. నీరు చిన్న చిన్న స్పటికాలుగా మారకుండా నిరోధిస్తుంది కొబ్బరినీరు. మంచి ఫలితాల కోసం కొబ్బరి నీళ్లలో సబ్జా గింజలను కలపి తీసుకుంటే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.

స్టోన్లు బాగా పెరిగే వ‌ర‌కు తెలియ‌కుండా ఉంటే మాత్రం ఆపరేష‌న్ చేయాల్సి వస్తుంది. అయితే కిడ్నీ స్టోన్లను నిజానికి ఆరంభంలోనే గుర్తించడం సులభమే అంటున్నారు నిపుణులు. శ‌రీరం మ‌న‌కు ప‌లు లక్షణాలు, సూచ‌న‌ల‌ ద్వారా తెలియ‌జేస్తుంది. ఈ లక్షణాలను గుర్తించి నిర్దారిస్తే.. కిడ్నీ స్టోన్‌లను ఆరంభంలోనే తొల‌గించుకోవచ్చు. కిడ్నీ స్టోన్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడ‌మ ప‌క్కన ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. లేదా ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడ‌మ వైపు నొప్పి వస్తుంటుంది. ఇక ఈ నొప్పి పోటు పొడుస్తున్నట్టుగా ఉంటుంది.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

Telegram CEO Pavel Durov: కంపెనీలను తయారు చేయాలి అనుకుంటే ఆ సబ్జెక్టు నేర్చుకోవాలి

Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విద్యార్థులకు కీలక సూచనలు, సలహాలు అందించారు. భవిష్యత్తులో మంచి కంపెనీలను స్థాపించాలంటే,ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలంటే వారికి ఏ సబ్జెక్ట్ మంచిదో తెలిపారు. ఎలాంటి సబ్జెక్ట్‌ను ప్రాధాన్యత ఇవ్వాలో కూడా ఆయన వెల్లడించారు. ఇంతకీ ఆయన చేసిన సూచనలు సలహాలు ఏంటి అనుకుంటున్నారా? ఈ విషయమై...

Male Ear Piercing: అబ్బాయిలు చెవి కుట్టించుకుంటే బెటరా? కాదా? ఏది నిజం?

Male Ear Piercing: హె డియర్స్. ఇప్పుడు మనం ఒక భలే ఇంట్రెస్ట్ టాపిక్ గురించి తెలుసుకుందామా? సాధారణంగా ఆడవాళ్లు చెవులు కుట్టించుకుంటారు. అదంతా బాల్యంలోనే జరుగుతుంది. తర్వాత కావాలి అంటే చెవిలోనే కాస్త పైకి మధ్యలో కూడా చెవి కుట్టించుకొని అలంకరించుకుంటారు. కానీ అబ్బాయిలకు కూడా ఈ చెవి పోగులు ఉంటాయి. ఇలాంటి...

Health Alert: సమోసా, వడపావ్, జిలేబీ లు తింటున్నారా?

Health Alert: సమోసా, వడ పావ్, జిలేబీ, గులాబ్ జామూన్ ల పేరు వింటే చాలు ఎంత నోరు ఊరుతుంది కదా. ఇవంటే చాలా మందికి ఇష్టం. కనిపిస్తే నోరూ ఊరడమే కాదు గుటుక్కుమన మింగేస్తారు చాలా మంది. కానీ మీరు కూడా ఇలాగే తింటే ఓ హెల్త్ వార్నింగ్ వచ్చింది. దాని గురించి...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.