Homeహెల్త్‌Deep Sleep Tips: గాఢ నిద్ర కోసం రాత్రి ఏం చేయాలి.. ఏం చేయొద్దు..

Deep Sleep Tips: గాఢ నిద్ర కోసం రాత్రి ఏం చేయాలి.. ఏం చేయొద్దు..

Deep Sleep Tips: నేటి కాలంలో ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిద్రలేమి ఒకటి. పని ఒత్తిడి, మొబైల్ ఫోన్ల వినియోగం, మానసిక ఆందోళనలు, జీవనశైలిలో మార్పులు వంటి కారణాలతో చాలామందికి రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టడం లేదు. దీంతో ఉదయం అలసటగా అనిపించడం, ఏకాగ్రత తగ్గడం, పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే నిద్రకు ముందు కేవలం 10 నిమిషాలు కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే గాఢ నిద్రతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలవాటుతో మంచి నిద్ర పోవచ్చు. అదేంటంటే?

ధ్యానం:
నిద్రపోయే 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మెదడులో రోజంతా పేరుకుపోయిన ఒత్తిడి తగ్గుతుంది. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర త్వరగా పట్టడమే కాకుండా నాణ్యమైన నిద్ర లభిస్తుంది.

ఇష్టదైవాన్ని స్మరించుకోవడం:
నిద్రకు ముందు కొద్దిసేపు ఇష్టమైన దేవుడిని స్మరించుకోవడం లేదా చిన్న ప్రార్థన చేయడం వల్ల మనసులో సానుకూల భావనలు పెరుగుతాయి. ఆందోళనలు, భయాలు తగ్గి ప్రశాంతమైన మానసిక స్థితితో నిద్రలోకి వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది.

క్షమించే గుణం:
రోజంతా జరిగిన సంఘటనల్లో ఎవరైనా బాధపెట్టినా, కోపం లేదా ద్వేషాన్ని మనసులో ఉంచకుండా వారిని క్షమించేందుకు ప్రయత్నించాలి. ప్రతికూల ఆలోచనలను వదిలేయడం వల్ల మనసు తేలికగా మారి ఒత్తిడి తగ్గుతుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది.

గోరువెచ్చని నీటితో స్నానం:
నిద్రకు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం శరీరంలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. రోజంతా ఉన్న అలసట తగ్గి శరీరం విశ్రాంతి స్థితికి చేరుకుంటుంది. దీంతో నిద్ర త్వరగా పట్టే అవకాశం ఉంటుంది.

పుస్తకం చదవడం:
పడుకునే ముందు కొద్దిసేపు మంచి పుస్తకం చదవడం కూడా మంచి అలవాటు. అయితే భయానక కథలు లేదా ఉత్కంఠ కలిగించే విషయాల కంటే ప్రశాంతతను కలిగించే పుస్తకాలను ఎంచుకోవడం మంచిది. ఇది మెదడును విశ్రాంతి స్థితికి తీసుకెళ్తుంది.

నిద్రపోయే ముందు ఈ అలవాట్ల చేసుకోవడం ఎంత ముఖ్యమో.. మరికొన్ని అలవాట్లకు దూరంగా ఉండడం బెటర్. వాటిలో కొన్నింటిని చూద్దాం..

మొబైల్‌కు దూరం:
నిద్రకు కనీసం 30 నిమిషాల ముందు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ వంటి స్క్రీన్‌లను ఉపయోగించకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి నిద్రను ఆలస్యం చేస్తుంది.

కెఫిన్ తగ్గించడం:
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం, నిద్రకు ముందు కాఫీ లేదా టీ వంటి కెఫీన్ పానీయాలను తగ్గించడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు కూడా మంచి నిద్రకు దోహదపడతాయి. గాఢ నిద్ర శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular