Drinks Before Bed : ప్రస్తుత కాలంలో చాలామందికి నిద్ర కరువు అవుతుంది. రకరకాల ఒత్తిడులు, ఇతర సమస్యల కారణంగా మానసికంగా ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ప్రభావం రాత్రి సమయంలో పడి సరైన నిద్ర పోవడం లేదు. అయితే వైద్యులు తెలుపుతున్న ప్రకారం ప్రతిరోజు కనీసం 7 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు తెలుపుతున్నారు. కానీ చాలామందికి పడుకోగానే నిద్ర రావడం లేదు. ఇలాంటి సమయంలో కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర వచ్చే అవకాశాలుంటాయి. ఆ పానీయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతిరోజు మంచి నిద్ర ఉండాలంటే పడుకునే ముందు గోరువెచ్చటి పాలు తాగాలని వైద్యులు తెలుపుతున్నారు. పాలలో ఉండే ట్రిప్టోపాన్ శరీరంలో సెరోటోటిన్ తయారు కావడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా మెలటోనిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది నిద్రకు అనుకూలమైన వాతావరణము కల్పిస్తుంది. ఫలితంగా తొందరగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది. అయితే రాత్రి సమయంలో చాలామందికి పాలు తాగడం అలవాటు ఉండదు. ఇలాంటివారు గోరువెచ్చని నీటిని తాగినా కూడా సరైన ఫలితం ఉంటుందని అంటున్నారు. కానీ కేవలం గోరువెచ్చని నీరు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందన్న గ్యారెంటీ ఇవ్వలేమని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అయితే కెఫిన్ లేని కొన్ని హెర్బల్ టీ తాగడం వల్ల గాఢ నిద్ర వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారి సరైన నిద్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కొందరు రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగాలని అనుకుంటారు. దీనిని తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సాధ్యమైనంత వరకు టీ తాగాలని అనుకునేవారుకెఫిన్ కు దూరంగా ఉండటమే మంచిది అని అంటున్నారు.
కేవలం పానీయాలు మాత్రమే కాకుండా తొందరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో ఫ్రైడ్ ఫుడ్ కాకుండా సాత్విక ఆహారం తీసుకోవాలని అంటున్నారు. వీటివల్ల తొందరగా జీర్ణమై నిద్రపంగం కలగకుండా ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్ వైపు చూడవద్దని చెబుతున్నారు. కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల మానసికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శరీరంలోకి ఇవి వెళ్లిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటిని రాత్రి సమయంలో తీసుకుంటే పదేపదే బాత్రూంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా నిద్రపంగం కలిగే అవకాశం ఉంటుంది.