Homeలైఫ్ స్టైల్Garlic Benefits: మన ఇంట్లో ఉండేదే.. పట్టించుకోం గాని.. డాక్టర్ కంటే ఎక్కువ..

Garlic Benefits: మన ఇంట్లో ఉండేదే.. పట్టించుకోం గాని.. డాక్టర్ కంటే ఎక్కువ..

Garlic Benefits: పెరట్లో పండే అరటి సొంత వైద్యానికి పనికిరాదు అంటారు. ఈ సామెత మిగతా వాటికేమో గాని.. దీనికి మాత్రం పూర్తిగా వర్తిస్తుంది. ఇది మరి అంత విలువైనది కాదు. మన ఇంట్లోనే ఉంటుంది. కాకపోతే దీనిని అంతగా పట్టించుకోం. ఇది డాక్టర్ లాగా పనిచేస్తుంది.. ఎంతలా అంటే గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అలాగని ఇదేదో మందు కాదు. ప్రకృతి ప్రసాదించిన వరం. మన వంటింట్లో పప్పు […]

Garlic Benefits: పెరట్లో పండే అరటి సొంత వైద్యానికి పనికిరాదు అంటారు. ఈ సామెత మిగతా వాటికేమో గాని.. దీనికి మాత్రం పూర్తిగా వర్తిస్తుంది. ఇది మరి అంత విలువైనది కాదు. మన ఇంట్లోనే ఉంటుంది. కాకపోతే దీనిని అంతగా పట్టించుకోం. ఇది డాక్టర్ లాగా పనిచేస్తుంది.. ఎంతలా అంటే గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అలాగని ఇదేదో మందు కాదు. ప్రకృతి ప్రసాదించిన వరం.

మన వంటింట్లో పప్పు దినుసుల నుంచి మొదలుపెడితే చక్కెర వరకు అన్ని పదార్థాలు ఉంటాయి. అందులో ఇది కూడా ఉంటుంది. దీని పేరు వెల్లుల్లి. చూసేందుకు తెల్లగా.. పాయలు పాయలుగా ఉంటుంది వెల్లుల్లి.. ఇది ఘాటువాసన కలిగి ఉంటుంది. కూరలో వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. చింతకాయ పచ్చడి, పప్పు, సాంబార్, ఇంకా కొన్ని రకాలైన వేపుడు కూరల్లో వెల్లుల్లి వాడుతుంటారు. వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉంటాయి. ఇందులో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. పూర్తిగా బిపిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిల పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలను మొత్తం తొలగిస్తుంది. రక్తంలో ఉన్న చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది.

ఇది సహజసిద్దమైన సూపర్ ఫుడ్. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి దేహానికి రక్షణ కల్పిస్తుంది. అయితే దీనిని వండడం వల్ల పోషకాలు పోతాయని.. పచ్చిగానే తింటే ప్రయోజనం లభిస్తుందని వైద్యులు అంటున్నారు.. వెల్లుల్లి భూగర్భంలో పండుతుంది. అనేక రసాయనిక ప్రక్రియలకు గురైన తర్వాత ఇందులో పాయలు అభివృద్ధి చెందుతాయి. అందులో అల్లిసిన్ డెవలప్ అవుతుంది. అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రమాదకరమైన కొవ్వులను కరిగేలా చేస్తుంది. రక్తనాళాలు పేరుకుపోయిన కొవ్వు నిల్వలను తగ్గేలా చేస్తుంది. రక్తపోటుని క్రమబద్ధీకరించడంలో వెల్లుల్లి తర్వాతే ఏదైనా. ఈ సహసిద్ధమైన ఫుడ్ ను పచ్చిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు.. ఇతర అనారోగ్యం సోకినప్పుడు మన ఇంట్లో వెల్లుల్లి కారం చేస్తుంటారు. అది రుచికి ఎంతో బాగుంటుంది. అలాగే చేయడానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందువల్లే వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

గమనిక

వెల్లుల్లి సహజ సిద్ధమైన ఫుడ్. అయితే ఇది అందరికీ పడదు. కొందరిలో వెల్లుల్లి తింటే రాషేస్ వస్తుంటాయి. అటువంటివారు వైద్యుల సలహా మేరకు వెల్లుల్లి తీసుకోవాలి. కొంతమందికి పచ్చి వెల్లుల్లి తింటే వాంతులు అవుతుంటాయి. అటువంటివారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కథనం కేవలం పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే. వైద్యుల చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నయం కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper