Kashmir Garlic Benefits : మనం రోజు తినే ఆహారంలో వెల్లుల్లి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు తయారుచేసే కూరలో ఇది లేకపోతే రుచి కూడా ఉండదు. వెల్లుల్లి ప్రతిరోజు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. బీపీ కంట్రోల్ కు వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే సాధారణ వెల్లుల్లి కంటే కాశ్మీర్ వెల్లుల్లి తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సాధారణ వెల్లుల్లి నాలుగు లేదా ఐదు రెబ్బలు తీసుకుంటే.. కాశ్మీర్ వెల్లుల్లి మాత్రం రెండు రెబ్బలతో అత్యధిక ప్రయోజనాలను అందిస్తుంది. అసలు కాశ్మీర్ వెల్లుల్లిలో ఉండే పోషకాలు ఏమో చూద్దాం..
కాశ్మీర్ వెల్లుల్లిని స్నో మౌంటెన్ గార్లిక్ అని కూడా అంటారు. ఇందులో అలిన్, అలిసిన్, ఎస్ అలైన్ సిస్టీన్, డైలైన్ సల్ఫెడ్స్, ప్లేవనాయిడ్స్ పినాల్స్, సెలీనియం, సాపొనిక్స్, సల్ఫర్ కంపాక్స్ వంటి ఔషధాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. సాధారణంగా వెల్లుల్లిలో అలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లేటప్పుడు అలిసిన్ గా మారిపోతుంది. అయితే అలిన్ నుంచి అలిసిన్ అనే పదార్థం ఎక్కువ మొత్తంలో ఉండడానికి వెల్లుల్లి తీసుకునే పద్ధతిని మార్చుకోవాలి.
చాలామంది వెల్లుల్లి నాలుగు లేదా ఐదు రెబ్బలను తీసుకుంటూ ఉంటారు. వీటిని చితక్కొట్టిన తర్వాత వెంటనే కూరలో వేస్తారు. అలా కాకుండా చితగ్గొట్టిన తర్వాత కనీసం 15 నిమిషాల పాటు నిల్వ ఉంచడం ద్వారా అలసిన్ అనే పదార్థం ఎక్కువ మొత్తంలో తయారవుతుంది. దీంతో సాధారణం కంటే ఎక్కువ పోషకాలు అందుతాయి. అలాగే చితక్కొట్టిన వెల్లుల్లిని నూనెలో వేయించకుండా.. ఆహారంలో చివరగా లేదా ఆహారంతో కలిపి నేరుగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లిలో ఉండే ప్రయోజనాలు శరీరంలోకి వెళ్లి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అయితే సాధారణంగానే మార్కెట్లో దొరికే వెల్లుల్లితో ఈ రకమైన ప్రయోజనాలు ఉంటాయి. కానీ కాశ్మీర్ వెల్లుల్లితో ఇవి రెట్టింపు ఉంటాయి. ఉదాహరణకు సాధారణ వెల్లుల్లి నాలుగు లేదా ఐదు రెబ్బలు కంటే కాశ్మీర్ వెల్లుల్లిని కేవలం రెండు రెబ్బలు మాత్రమే తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ అత్యధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి ఈ కాశ్మీర్ వెల్లుల్లి ఎంతో ప్రయోజనాకరంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచే విధంగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో ప్రవేశించే వైరస్, బ్యాక్టీరియాను చంపేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. యాంటీ మైక్రోబియల్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ తగ్గించడానికి కూడా ఇది ఎంతో సహకరిస్తుంది.