spot_img
Homeవింతలు-విశేషాలుJunk Food: సాయంత్రం మిర్చి బజ్జిలు తింటున్నారా.. సరదాగా సమోసాలు లాగిస్తున్నారా.. ఇది మీకోసమే..

Junk Food: సాయంత్రం మిర్చి బజ్జిలు తింటున్నారా.. సరదాగా సమోసాలు లాగిస్తున్నారా.. ఇది మీకోసమే..

Junk Food: ఉదయం టిఫిన్ తింటాం. మధ్యాహ్నం లంచ్ చేస్తాం. సాయంత్రం పూట లేదా కాఫీ తాగిన తర్వాత.. నాలుక ఏదో రుచిని కోరుకుంటుంది. వెంటనే మిర్చి బజ్జీలో.. వేడివేడి గారెలో.. సమోసా లో.. ఫ్రెంచ్ ఫ్రైసో లాగించేస్తాం. ఒకటి రెండు అనే స్థాయి నుంచి గట్టిగానే కుమ్మేస్తాం. ఇక రాత్రి డిన్నర్ కూడా తినేస్తాం.

ఇన్ని తినేసిన తర్వాత కచ్చితంగా ఆ ఆహార పదార్థాలు శరీరంలో నిల్వ ఉంటాయి. నూనెలో వేయించిన పదార్థాలు కచ్చితంగా కొవ్వులుగా మారిపోతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. సాయంత్రం పూట సరదాగా తిన్నవాటికి ఈ స్థాయిలో కొవ్వు పెరిగిపోతుందా.. అది ఆరోగ్యానికి చేటు తెస్తుందా అని అస్సలు అనుకోవద్దు.. పోషకాహార నిపుణులు.. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. సాయంత్రం పూట రెండు మిర్చి బజ్జీలు తిన్నా సరే మరుసటి రోజు ఉదయం 45 నిమిషాల పాటు సైకిల్ చేయాల్సిందేనట. సరదాగా ఆలూ చిప్స్ తిన్నప్పటికీ.. మరుసటి రోజు ఉదయం 45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయాల్సిందేనట.. ఇవి మాత్రమే కాదు.. చాక్లెట్ తింటే దాదాపు అర్థగంట పాటు ఈత కొట్టాలట. బిర్యానీ తింటే ఏకంగా రెండు గంటల పాటు నడవాలట.. ఎందుకంటే వీటి ద్వారా శరీరంలోకి అదనంగా కేలరీలు చేరుతాయట. వాటిని కరిగించాలంటే కచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందేనట.

మనలో చాలామందికి ధూమపానం.. మద్యపానం అనేవి అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు అని తెలుసు. కానీ వాటి అన్నిటికి మించి జంక్ ఫుడ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే ఆల్ట్రా ప్రాసెసింగ్ ఆహారాలు మెదడులో ఉన్న ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయట. ఇటీవల ఫిన్లాండ్ ప్రాంతంలోని హెల్సిం కి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని చేశారు. వారి పరిశీలనలో ఈ విషయాలు తెలిశాయి.

ఇతర దేశాలలో పిజ్జాలు.. బర్గర్లు.. ఫ్రెంచ్ ఫ్రైస్.. నూడిల్స్.. శీతల పానీయాలు.. చిప్స్ తీసుకోవడం పరిపాటి.. ఇక మన దగ్గర అయితే చాక్లెట్లు.. కేకులు.. పానీపూరీలను చాలామంది దండిగా లాగిస్తుంటారు. ఇలా తినడం వల్ల మెదడులో కొన్ని భాగాల పనితీరు పూర్తిగా మారుతుందట. ఊబకాయంతో పాటు.. గుండె జబ్బులు.. మధుమేహం.. జీర్ణ సమస్యలు.. కిడ్నీ సమస్యలు.. అధిక రక్తపోటు వంటివి వస్తాయట..

సాధారణంగా మనం ఒక సమస్య తింటే అది జీర్ణం కావడానికి దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుందట.. అందువల్లే జంక్ ఫుడ్ మొత్తానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఓ నివేదిక ప్రకారం ధూమపానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 7 0 లక్షల మంది చనిపోతుంటే.. జంక్ ఫుడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 1.1 కోట్ల మంది చనిపోతున్నారు.. అమెరికాలోని సియాటెల్ ప్రాంతంలో ఉన్న ఈ నిచ్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ దిగ్భ్రాంతికరమైన నిజం తేలింది. ఇక మన దేశం విషయానికి వస్తే 2009 నుంచి 2023 వరకు జంక్ ఫుడ్ వినియోగం ఏకంగా 150 శాతానికి పెరిగింది. అందువల్లే మధుమేహం.. ఒబెసిటి సమస్య పెరిగిపోతుంది.

ఇవి చేయాల్సిందే

ఆలు చిప్స్ 50 గ్రాములు ప్యాకెట్ తీసుకోవడం ద్వారా 250 నుంచి 280 కేలరీల శక్తి లభిస్తుంది. 40 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తేనే ఈ శక్తి కరిగిపోతుంది.

ఒక డోనట్ తింటే 250 నుంచి 350 క్యాలరీల శక్తి వస్తుంది. ఇది కరగాలంటే 35 నిమిషాల పాటు జాగింగ్ చేయాలి.

300 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ తీసుకుంటే 150 నుంచి 200 కేలరీల శక్తి వస్తుంది. 20 నిమిషాలు ఈత కొడితే ఇది కరిగిపోతుంది.

ఒక మీడియం సైజ్ చాక్లెట్ బార్ తింటే 250 నుంచి 300 కేలరీల శక్తి వస్తుంది. ఇది కరగాలంటే 30 నిమిషాల పాటు ఈత కొట్టాలి.

రెండు పీసుల గులాబ్ జామ్ తింటే.. 300 నుంచి 350 క్యాలరీల శక్తి వస్తుంది. ఇది కరగాలంటే 45 నిమిషాల పాటు జుంబా డ్యాన్స్ చేయాలి.

ఫ్రెంచ్ ఫ్రైస్ లార్జ్ పోర్షన్ కనుక తింటే.. 400 నుంచి 500 క్యాలరీల శక్తి వస్తుంది.. ఇది కరగాలంటే గంటన్నర పాటు నడవాలి.

పిజ్జా మీడియం స్లైస్ గనుక తీసుకుంటే 250 నుంచి 300 కేలరీల శక్తి లభిస్తుంది. ఇది కరగాలంటే 45 నిమిషాల బ్రిస్క్ వాక్ చేయాలి.

ఆరు పానీపూరీలు తింటే 200 నుంచి 250 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇది కరగాలంటే 30 నిమిషాల బ్రిస్క్ వాక్ చేయాలి.

చికెన్ లేదా వెజ్ బర్గర్ 85 నుంచి 150 గ్రాములు గనుక తీసుకుంటే.. శరీరానికి 350 నుంచి 500 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇది కరగాలంటే గంట సైక్లింగ్ లేదా 40 నిమిషాల పాటు రన్నింగ్ చేయాలి.

ఐస్ క్రీమ్ ఒక స్కూప్ తీసుకుంటే 150 నుంచి 250 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇది కరగాలంటే 25 నిమిషాల పాటు రన్నింగ్ చేయాలి.

చాక్లెట్ కేక్ ఒక పీస్ తింటే 350 నుంచి 450 క్యాలరీల శక్తి వస్తుంది. ఇది కరగాలంటే గంట పాటు ఏరోబిక్స్ లేదా డ్యాన్స్ చేయాలి.

నూడిల్స్ లేదా మంచూరియా ఒక ప్లేట్ లాగిస్తే.. 500 నుంచి 700 క్యాలరీల శక్తి వస్తుంది. ఇది కరగాలంటే గంటన్నర పాటు రన్నింగ్ చేయాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular