Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Panchayati Raj National Award: 24 వ స్థానం నుండి 1వ స్థానానికి...

Pawan Kalyan Panchayati Raj National Award: 24 వ స్థానం నుండి 1వ స్థానానికి ఎగబాకిన పంచాయితీ రాజ్ శాఖ..పవన్ పనితీరుకు జాతీయ పురస్కారం..

Pawan Kalyan Panchayati Raj National Award: తెలుగు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత , పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి(Deputy CM Pawan Kalyan) బాధ్యత చేపట్టడం ఆయన అభిమానులకు గర్వ కారణం. అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఆ పదవి ని అలంకరణ కోసం వాడుకోకుండా, తానూ బాధ్యత చేపట్టిన శాఖలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ దేశం లోనే […]

Pawan Kalyan Panchayati Raj National Award: తెలుగు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత , పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి(Deputy CM Pawan Kalyan) బాధ్యత చేపట్టడం ఆయన అభిమానులకు గర్వ కారణం. అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఆ పదవి ని అలంకరణ కోసం వాడుకోకుండా, తానూ బాధ్యత చేపట్టిన శాఖలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ దేశం లోనే నెంబర్ 1 స్థానం లో నిల్చింది. వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాం లో 24 వ స్థానం లో ఉన్న ఈ శాఖ, ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకుందంటే పవన్ కళ్యాణ్ పని తీరు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామా సభలు ఏర్పాటు చేసి, గ్రామాల్లోని ప్రజలు చేత వాళ్లకు అవసరమయ్యే పనులన్నీ కలెక్టర్ల దృష్టికి చేర్చి, పల్లె పండుగ పేరుతో రెండు విడతల్లో పవన్ కళ్యాణ్ ఈ స్థాయి ఫలితాలను అందుకున్నాడు.

అభిమానులు ఎంతసేపు సినిమా ఫ్యాన్ వార్స్ లో దూరి రికార్డ్స్ కోసం కొట్లాడుకోవడం కాకుండా, ఇలాంటి విషయాలను జనాల్లోకి తీసుకెళ్తే నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్తుంది అంటూ సోషల్ మీడియా లో రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యం లో ప్రతీ ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సేతత్ వికాస్ జాతీయ సంస్థ గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ , పారిశుద్యం విభాగాల్లో పురస్కారాలను అందిస్తూ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పంచాయితీ రాజ్ శాఖ లో అవార్డులు అందుకుంది. ఇప్పుడు వరుసగా రెండవసారి కూడా అవార్డులను అందుకోవడం విశేషం. ఈ సంవత్సరం అయితే పంచాయితీ రాజ్ శాఖ ఏకంగా 5 విభాగాల్లో అత్యుత్తమ ర్యాంక్ అందుకుంది. గుడ్ గవర్నెన్స్ విభాగం లో శృంగవరం పంచాయత్ మొదటి స్థానం లో నిలబడింది.

అదే విధంగా వుమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ గా బొక్కాసం పాలెం అనే గ్రామం కూడా మొదటి స్థానం లో నిల్చింది. పేదరికం లేని గ్రామంగా, అత్యంత ప్రమాణాలతో జీవనం సాగుతున్న గ్రామం గా చెమ్ములపల్లి పంచాయత్ 2 వ స్థానం లో కొనసాగుతుండగా, సెల్ఫ్ సఫీషియంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ విభాగం లో గుండుమల పంచాయత్ 3వ ర్యాంక్ లో కొనసాగుతుంది. ఇక ఉత్తమ మండలం విభాగం లో అయితే కుప్పం దేశం లోనే 3 వ ర్యాంక్ సాధించింది. ఇలా పవన్ కళ్యాణ్ ఆద్వర్యం లో పంచాయితీ రాజ్ శాఖ ఎప్పుడూ చూడనంత అభివృద్ధిని చూస్తూ దేశంలోనే మన ఆంధ్ర ప్రదేశ్ ని ఆదర్శవంతమైన రాష్ట్రము గా తీర్చి దిద్దాడు పవన్ కళ్యాణ్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper