Tattoo : ప్రస్తుత జనరేషన్లో టాటూలకు చాలా క్రేజ్ ఉంది. చేతులు, మెడ, మెడ, వీపు.. ఇలా శరీరంలోని అనేక ఇతర ప్రదేశాలపై పచ్చబొట్టు వేయించుకోవడం ఫ్యాషన్ గా మారింది. కొందరైతే తమకు ఇష్టమైన వ్యక్తుల పేరును తమ శరీరంపై టాటూ గా వేయించుకోవడం కూడా చూస్తుంటాం. మరికొందరు శరీరంపై రకరకాల డిజైన్లను వేయించుకొని ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఇంతకీ ఇలా చేయడం మంచిదా? కాదా? దీని గురించి పక్కన పెడితే టాటూలు వేసుకున్నవారు రక్తదానం చేయవచ్చా అనే అనుమానం మీకు వచ్చిందా?
ముఖ్యంగా యువత తమ శరీరాలపై రకరకాల టాటూలు వేసుకుంటున్నారు. స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఇప్పుడు టాటూలు ప్రతి ఒక్కరు వేయించుకోవడం అలవాటుగా మారింది. కానీ మీకు తెలుసా.. శరీరంలో ఎక్కడైనా పచ్చబొట్లు లేదా టాటూలు ఉంటే, రక్తదానం చేయడం కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. చాలా చోట్ల రక్తం తీసుకోవడానికి వైద్యులు ఇష్టపడరు. అయితే ఒంటిపై పచ్చబొట్టు ఉంటే రక్తం ఎందుకు ఇవ్వలేరు? రక్తదానం చేయడానికి సమస్య ఏమిటి? అనే సందేహం మీకూ కలిగిందా..
నిజానికి, శరీరంపై పచ్చబొట్టు ఉంటే రక్తదానం చేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని వైద్యులు చెబుతున్నారు. మీరు పచ్చబొట్టుతో సులభంగా రక్తదానం చేయవచ్చు. ఇది రోగికి ఎటువంటి హాని కలిగించే అవకాశం లేదు. కానీ ఇలాంటి వారు కొన్ని మార్గదర్శకాలను అనుసరించడం అవసరం. లేకుంటే పెను ప్రమాదం సంభవించవచ్చు.
పచ్చబొట్లు ఎల్లప్పుడూ కొత్త సూదులు ఉపయోగించి చేయాలి. టాటూ వేసుకునే వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించాలి. కొన్నిసార్లు చాలా మందికి ఒకే సూదులతో పచ్చబొట్టు వేస్తుంటారు. ఇలా వేయించుకుంటే పచ్చబొట్టు పొడిపించుకున్న వ్యక్తికి అంత మంచిది కాదు. ఇలాంటి సందర్భంలో రక్తం ద్వారా మూడు ప్రాణాంతక వ్యాధులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది తరువాత రోగి శరీరానికి వ్యాపిస్తుంది.
ఇన్ఫెక్షన్ తర్వాత వైరస్ పునరుత్పత్తి చేసే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని పిలుస్తారట. అంటే ఒక వ్యక్తికి ఆరు నెలలలోపు హెచ్ఐవి, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వైరస్ సోకినట్లయితే ఆ సమయంలో రక్త పరీక్ష చేయించుకుంటే, రిపోర్టు ప్రతికూలంగా రావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి టాటూ వేయించుకున్న ఆరు నెలలలోపు రక్తదానం చేయవద్దు అంటున్నారు నిపుణులు. ఈ జాగ్రత్త పాటించడం చాలా అవసరం. కాబట్టి టాటూ వేసుకునే ముందు కనీసం ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఆరు నెలల తర్వాత రక్తపరీక్ష చేయించుకుని శరీరంలో వ్యాధి వ్యాప్తి చెందలేదని తెలుసుకోవడం చాలా అవసరం.. అప్పుడు మీరు పచ్చబొట్టు కలిగి ఉన్నప్పటికీ సురక్షితంగా రక్తాన్ని ఇవ్వవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కొంతమంది వైద్యులు ఒక సంవత్సరం పాటు రక్తదానం చేయడాన్ని నిషేధిస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Can people with tattoos donate blood
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com