Homeఎంటర్టైన్మెంట్Akhanda Movie: "అఖండ" సినిమాలో బాల బాబాయ్ అద‌ర‌గొట్టాడు అంటున్న ఎన్టీఆర్...

Akhanda Movie: “అఖండ” సినిమాలో బాల బాబాయ్ అద‌ర‌గొట్టాడు అంటున్న ఎన్టీఆర్…

Akhanda Movie: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ, బోయ‌పాటి కాంబినేష‌న్ లో వచ్చిన తాజా చిత్రం అఖండ‌. కాగా నిన్ననే (డిసెంబర్ 2 ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూవీపై ముందు నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు వీరిద్దరు. […]

Akhanda Movie: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ, బోయ‌పాటి కాంబినేష‌న్ లో వచ్చిన తాజా చిత్రం అఖండ‌. కాగా నిన్ననే (డిసెంబర్ 2 ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూవీపై ముందు నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు వీరిద్దరు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా … ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో చెలరేగాడు. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇక తన మ్యూజిక్ తో తమన్ థియేటర్లలో మోత మొగిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. పలువురు సెల‌బ్రెటీలు సినిమా చూసి వారి అభిప్రాయలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ బాలకృష్ణకు అభినంద‌నలు తెలుపుతున్నారు.

young tiger ntr respond about balakrishna akhanda movie

తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై స్పందించాడు. ట్విట్ట‌ర్ వేదికగా అఖండ పై స్పంద‌న తెలిపాడు. తాను అఖండ సినిమా చూశానని… ఈ మూవీతో బాల బాబాయ్ రీసౌండిగ్ స‌క్స‌స్ అందుకున్నాడ‌ని అన్నాడు. అఖండ చిత్ర బృందానిక అభినంద‌నలు తెలిపాడు తారక్. అఖండ సినిమాలో బాల‌కృష్ణ అభిమానులు ఎంజాయ్ చేయడానికి చాలా సంద‌ర్భాలు ఉన్నాయ‌ని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ముఖ్యంగా అఘోర పాత్రలో బాల‌కృష్ణ చేసిన సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper