Megastar chiranjeevi: తెలుగు తెరపై తరగని రారాజు మెగాస్టార్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన ఈస్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి డజను మంది హీరోలు ఉన్నారంటే అదంతా మెగాస్టార్ పరిచిన రాచబాటే..ఆయన స్వయంకృషితో ఎదిగి తన కుటుంబాన్ని నిలబెట్టారు. ఇండస్ట్రీ పెద్దగా మారారు.

అయితే చిరంజీవి ఒక్కరోజులో ఈ స్థాయికి రాలేదు. ఆయన కష్టం వెనుక ఎన్నో కన్నీళ్లు, కడగండ్లు ఉన్నాయి. ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. వాటన్నంటిని దిగమింగుకొని మరీ ఈ స్థాయికి చేరారు.
తాజాగా చిరంజీవితో ఒకప్పుడు కలిసి నటించిన నటి తులసి శివమణి ఓ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన కొత్తలో ఆయనకు ఓ శిక్ష పడిందట.. రోజంతా ఎండలో నిలబడాల్సి వచ్చిందట.. ఆ శిక్ష ఏంటి? ఎవరు వేశారన్నది తులసీ చెప్పుకొచ్చింది.
చిరంజీవి అప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ మొదట్లో ఆయన మంచి పేరును తీసుకొచ్చిన సినిమా ‘కోతల రాయుడు’. ఈ సినిమాను శ్రీ చిరిత చిత్ర నిర్మాణ సంస్థ తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. కే. వాసు దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి గ్రేషేడ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో తులసీ కీలక పాత్ర పోషించారు.
Also Read: త్వరలోనే ‘ఆచార్య’ నుంచి రెండు పెద్ద సర్ప్రైజ్లు
అయితే ‘కోతల రాయుడు’ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు షూటింగ్ కు ఆలస్యంగా వచ్చాడట చిరంజీవి. దానికి ఆ సినిమా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సీరియస్ అయ్యాడట.. వెంటనే పనిష్ మెంట్ కింద ఆ రోజంతా ఎండలో నిలబడాలని ఆదేశించాడట.. దానికి చిరంజీవి ఏమాత్రం సహనం కోల్పోకుండా తనవైపే తప్పు ఉందని గ్రహించి నిర్మాత ఆదేశానుసారం రోజంతా ఎండలో నిలబడ్డాట.. ఈ విషయాన్ని అందులో నటిస్తున్న తులసీ చూసి షాక్ అయ్యిందట..
అలా కెరీర్ మొదటి నుంచి దర్శక నిర్మాతలకు ఎంతో అనుకువగా.. వారు ఏమన్నా కూడా భరిస్తూ కష్టాలు, కండగండ్లను జయిస్తూ చిరంజీవి ఈ స్థాయికి చేరుకున్నారని ఈ ఘటన ద్వారా చెప్పొచ్చు.
Also Read: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సిద్ధ.. ఆచార్య టీజర్.. గంటలో మిలియన్ వ్యూస్!