Homeఎంటర్టైన్మెంట్Prabhas Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ టీజర్ పరిస్థితి ఏంటి..? అందులో ఇది హైలెట్...

Prabhas Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ టీజర్ పరిస్థితి ఏంటి..? అందులో ఇది హైలెట్ కానుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు తమదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతారు. వాళ్లు ప్రయోగాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే ప్రయోగాలు ఒకసారి సక్సెస్ అవ్వచ్చు మరోసారి ఫెయిల్ అవ్వచ్చు. కానీ యాక్షన్ సినిమాలు మాత్రం ఎప్పుడు ప్రేక్షకులను నిరాశపరచవు. ఒకవేళ సినిమా బాగా లేకపోయినా కూడా ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిప్రాయమైతే ఉంది. కాబట్టి మన హీరోలందరు అలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నారు.

Prabhas Rajasaab’s : ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల మీద ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఆయన కోసం చాలామంది దర్శకులు వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మీడియం రేంజ్ డైరెక్టర్ అయిన మారుతి డైరెక్షన్ రాజాసాబ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే రాజాసాబ్ సినిమా ఆయన చేయాల్సింది కాదు. కానీ మారుతి తనకు మంచి ఫ్రెండ్ అవ్వడంతో తను ఇచ్చిన మాట కోసం మారుతితో సినిమా చేస్తున్నాడు. నిజానికి మారుతి ఇప్పటివరకు ఏ స్టార్ హీరో తో కూడా సినిమా చేయలేదు. అలాంటిది డైరెక్ట్ గా ప్రభాస్ తో సినిమా చేయడం అనేది నిజంగా ఆయనకు ఒకరకంగా లక్ అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ పుట్టినరోజు కు సంబంధించిన వేడుకలు చాలా గ్రాండ్ గా చేయాలని అతని అభిమానులు చాలా వరకు అంచనాలు వేసుకుంటున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో రాజాసాబ్ టీజర్ కూడా వచ్చి ఆ టీజర్ కి భారీ హైప్ క్రియేట్ అయితే మాత్రం ఇక ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెరుగుతాయి. ఇంక దానికి తగ్గట్టుగానే ప్రభాస్ కూడా ఈ సినిమాని చాలా కమర్షియల్ సినిమాగా మార్చాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తను చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తే మాత్రం ప్రభాస్ కంటే కూడా ఇది మారుతికి చాలా బాగా హెల్ప్ అవుతుంది.

ఇక అందులో భాగంగానే కామెడీని హైలెట్ చేయాలని మారుతి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసమే ప్రత్యేకంగా టీజర్ ని కట్ చేయించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా మారుతి కెరియర్ ని మార్చే సినిమా అవుతుందా? లేదా అనే దాని మీదనే ప్రస్తుతం ట్రేడ్ పండితులు సైతం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper