spot_img
Homeఎంటర్టైన్మెంట్Shakalaka Shankar: పవన్ కళ్యాణ్ వల్లనే ఆ కమెడియన్ కెరియర్ నాశనం అయిందా..?

Shakalaka Shankar: పవన్ కళ్యాణ్ వల్లనే ఆ కమెడియన్ కెరియర్ నాశనం అయిందా..?

Shakalaka Shankar: సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన వరుస సినిమాలను చేసుకుంటూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని అయితే సంపాదించుకున్నాడు. వాళ్ళ అన్నయ్య చిరంజీవి ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే మంచి విజయాలు అందుకొని తనకంటూ పవర్ స్టార్ అనే ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళ అన్నయ్య పేరు వాడకుండా ఇండస్ట్రీలో చాలా ఉన్నత శిఖరాలని అధిరోహించాడనే చెప్పాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన అనే రాజకీయ పార్టీని పెట్టి అందులో చురుగ్గా పాల్గొంటున్నాడు.ఇక ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే తను చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడు అనేది మనం చాలా సార్లు విన్నాం… అలా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం వల్ల ఒక కమెడియన్ కెరీర్ అనేది నాశనమైంది అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు…

నిజానికి అందులో పవన్ కళ్యాణ్ తప్పేమీ లేదు తప్పంతా కమెడియన్ దే…సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కమెడియన్ షకలక శంకర్ ఆ సినిమా షూటింగ్ కి లేటుగా రావడం వల్ల షూటింగ్ అనేది చాలా సేపటి వరకు ఆపారు ఇక అందులో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో షకలక శంకర్ సీన్స్ ఉండడం వల్ల ఆయన కూడా శంకర్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత తను నిదానంగా రావడం డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడ్యూసర్, మేనేజర్లు లేటుగా ఎందుకు వచ్చారు అని అడిగిన కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా ఇష్టం వచ్చిన సమాధానం చెప్పడంతో ఆ విషయం పవన్ కళ్యాణ్ దాకా చేరుకుంది.

అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ అడగగా శంకర్ ఏదో సిల్లీ రీజన్ చెప్పాడు దాంతో పవన్ కళ్యాణ్ సినిమా అంటే టైం పాస్ చేసేది కాదు, సినిమాలో ఇబ్బంది అయితే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారని కోపంతో చెప్పి నీకు లేట్ అయిన పర్లేదు కానీ చెప్పే సమాధానం క్లారిటీ గా ఉండేలా చెప్పు మాట్లాడుతూ తనని కొట్టినట్టు గా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. అలా పవన్ కళ్యాణ్ చేతిలో దెబ్బలు తిన్నాడు కాబట్టి షకలక శంకర్ ని ఎవరు కూడా ఏ సినిమాలోకి తీసుకోవడం లేదనే వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఈ మధ్యన కొన్ని సినిమాల్లో నటిస్తూ శంకర్ మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper