spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijayendra Prasad: జూనియర్ ఎన్టీయార్ ని తక్కువ చేసి మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్...

Vijayendra Prasad: జూనియర్ ఎన్టీయార్ ని తక్కువ చేసి మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్…

Vijayendra Prasad: తెలుగు లో సింహాద్రి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి. ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి తన ఫస్ట్ సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ని ఎన్టీయార్ తో చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో ఎన్టీయార్ రాజమౌళి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.

అందుకే రాజమౌళి ఎన్టీఆర్ తో ఇప్పటివరకు నాలుగు సినిమాలను చేశాడు. ఇక తనకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగిన కూడా రాజమౌళి ఎన్టీఆర్ అనే చెప్తాడు.అలాగే ఎన్టీయార్ కి రాజమౌళి ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. ఇక ఎన్టీయార్ తో ఇంతమంచి సాన్నిహిత్యం ఉన్న రాజమౌళి అండ్ వాళ్ల ఫ్యామిలీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఎన్టీఆర్ ని తక్కువ చేసి మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ నా ఫస్ట్ సినిమాకి రాఘవేంద్ర రావు గారు ఒక మంచి హీరోని ఇస్తారు అనుకుంటే బండగా ఉన్న ఎన్టీఆర్ ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ మీద సెటైర్లు వేశాడు. అలాగే రాజమౌళి భార్య అయిన రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తీసిన సినిమాల్లో ఆమెకి నచ్చని సినిమా ఎది అని అడిగితే ఎన్టీయార్ హీరో గా చేసిన యమదొంగ సినిమా తనకి నచ్చదని చెప్పింది.

అలాగే రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ది సపోర్టింగ్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ రామ్ చరణ్ చేశాడు అంటూ మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్టీఆర్ అంటే వీళ్ళందరికి ఇష్టమని చెప్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ గురించి ఎందుకిలా ప్రతిసారీ తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి ఫ్యామిలీ మీద చాలా ఫైర్ అవుతున్నారు.

మొత్తానికైతే ఏదో ఒక రకంగా ఎన్టీయార్ ని డామినేట్ చేయాలనే ఉద్దేశ్యం తోనే వీళ్లు మాట్లాడుతూ ఉండటం ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తూందంటు ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయేంద్రప్రసాద్ ఎన్టీయార్ మీద చేసిన కామెంట్లు గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper