Homeఎంటర్టైన్మెంట్Vijay Political Expenses: సీఎం సీటు ఏమో గాని.. విజయ్ కి ఆ ఖర్చు తడిసి...

Vijay Political Expenses: సీఎం సీటు ఏమో గాని.. విజయ్ కి ఆ ఖర్చు తడిసి మోపెడవుతోంది..

Vijay Political Expenses: రాజుగారి వస్త్రాల కంటే.. మీసాలకు రాసే సంపెంగ నూనె శిరో భారం అవుతోంది.. వెనుకటికి ఆదాయానికి మించిన ఖర్చు ఉంటే ఈ సామెతను వాడేవారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను చూస్తుంటే ఈ సామెతను వాడక తప్పదేమో అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడి పరిస్థితులు అలా మారిపోయాయి.

తమిళనాడు ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. కనీసం మ్యాజిక్ ఫిగర్ అవకాశాన్ని కూడా దూరం చేశారు. అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఆ పార్టీ వద్ద లేదు. విజయ్ కి రాజకీయాలు కొత్త. రాజకీయాలు కూడా సినిమాలాగానే ఉంటాయని అనుకున్నాడు. కానీ అతని అంచనాలు అనుక్షణం తలకిందులవుతున్నాయి. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పటికీ.. విజయ్ అను నేను ప్రమాణ స్వీకారం చేయలేని దుస్థితి అతడిది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తామన్నప్పటికీ.. కమ్యూనిస్టులు ఒప్పుకోవడం లేదు.. ఏఐడీఎంకే బిజెపి కూటమిలో ఉంది కాబట్టి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విజయ్ పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిపోయింది. గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలపడం లేదు. దీంతో విజయ్ తీవ్రమైన సంకట స్థితిలో పడిపోయారు.

ఇప్పటికే విజయ్ తన ఎమ్మెల్యేలను మహాబలిపురంలో ఉన్న రిసార్ట్ లో ఉండమని చెబుతున్నారు. అక్కడ ప్రతిరోజు ఖర్చు లక్షలను దాటుతోంది. సెక్యూరిటీ సిబ్బంది.. ఎమ్మెల్యేలకు రోజు వంటకాలు.. వారి వ్యక్తిగత సిబ్బందికి ఏర్పాట్లు .. ఇవన్నీ కూడా విజయ్ కి తలకి మించిన భారంగా మారిపోతున్నాయి. సాధారణంగా ఒక సినిమా ఒప్పుకుంటే విజయ్ వందల కోట్ల పారితోషకం తీసుకుంటారు. జననాయగన్ సినిమా కోసం 270 కోట్ల వరకు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఒక సినిమా ఒప్పుకుంటే విజయ్ కోసం నిర్మాతలు కార్ వాన్ ఏర్పాటు చేయాలి. అందులోకి ఇతరులకు ప్రవేశం ఉండదు. పైగా విజయ్ వ్యక్తిగత సహాయకులకు కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేయాలి. విజయ్ ఇంటి వద్ద నుంచి షూటింగ్ స్పాట్ వరకు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చాలి. ఇన్ని చేసిన తర్వాత విజయ్ రిస్కీ షాట్లు చేసే అవకాశం ఉండదు. వాటికి డూప్ లను పెట్టాలి.

ఇంతవరకు విజయ్ ఇటువంటి వాటి మీద అంతగా దృష్టి సారించలేదు. ఎందుకంటే ఖర్చు అతడిది కాదు కాబట్టి నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకున్నాడు. రాజకీయాలలో అలా ఉండదు కదా.. ప్రతిదీ పార్టీ అధినేత పెట్టుకోవాలి. ఇక్కడ లెక్కలేసుకుంటే కుదరదు. అన్నట్టు సీఎం కుర్చి అంటే సర్కార్ సినిమాలో మాదిరిగా లెదర్ కూషనింగ్ తో ఉండదు. ఇదిగో దానికోసం ఇంత ఖర్చు పెట్టాలి. పది తలల శిరోభారాన్ని మోయాలి.

టీవీ కే ఎమ్మెల్యేలు మహాబలిపురంలోని రిసార్ట్ లో ఉంటున్నారు. అత్యంత విలాసమైన విడిది కేంద్రం. ప్రతిరోజు దీని ఛార్జ్ లక్షల్లో ఉంటుంది. ఇక వంటకాల రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాంటినెంటల్, వెస్ట్రన్ వంటకాలను ప్రతిరోజు ఎమ్మెల్యేలకు సరఫరా చేస్తునట్టు తెలుస్తోంది. తమిళనాడులో ప్రత్యేకమైన వంటకాలు అయిన తట్ట ఇడ్లీ, పొంగనాలు, రవ్వ దోశ, మినప, పెసరట్టు, కుట్టు పరోట, ఇందులోకి చేపలు, నాటుకోడి, మటన్, గుడ్లు వంటి వాటిని వడ్డిస్తున్నట్టు తెలుస్తోంది.

కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వెస్ట్రన్ వంటకాలు రుచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్, ఇటాలియన్ వంటకాలను కోరుకుంటున్నారు. గతంలో కూడా విజయ్ సభలో ప్రాణనష్టం చోటు చేసుకున్నప్పుడు.. బాధిత కుటుంబాలను విజయ్ ఈ రిసార్ట్ కి పిలిపించుకొని పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular