Homeఎంటర్టైన్మెంట్'అర్జున్‌ రెడ్డి' కాంబినేషన్ లో వెబ్ సిరీస్ !

‘అర్జున్‌ రెడ్డి’ కాంబినేషన్ లో వెబ్ సిరీస్ !

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఈ దశాబ్ధంలో అర్జున్‌ రెడ్డి చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. తెలుగు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన పునాది ‘అర్జున్ రెడ్డి’. సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ రాత్రికి రాత్రే టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా కూడా తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారడం, పైగా బాలీవుడ్ లో ఇదే […]


టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఈ దశాబ్ధంలో అర్జున్‌ రెడ్డి చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. తెలుగు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన పునాది ‘అర్జున్ రెడ్డి’. సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ రాత్రికి రాత్రే టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా కూడా తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారడం, పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్క‌డ సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిపోయాడు.

జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?

ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో మరో చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. భారీ ప్రాజెక్ట్‌ కి సంబంధించి స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేసుకుని ప్ర‌క‌టించ‌డానికి రెడీ అవుతున్న సమయంలో కరోనా రావడం, సందీప్ ప్లాన్ మొత్తం తారుమారైపోవడం, దాంతో తలపట్టుకున్న సందీప్ వంగ ఇక లాభం లేదనుకొని ఈ లాక్‌ డౌన్ లో ఒక వెబ్ సిరీస్ సిద్ధం చేసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ విజయ్ దేవరకొండ కోసమట. మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ లో మ‌రో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది.

కేసీఆర్ ఆందోళన అందుకేనా?

ఇక ప్రస్తుతం డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమా చేస్తోన్నాడు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తుండటం, పైగా మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తోన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper