Uppal Balu: ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్. ఈశ్వర్ సాయికి ఏడు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా. మాధురి రాథోడ్ కు గతంలోనే ఒక వ్యక్తితో సంబంధం ఉండేది. అయితే అది బ్రేకప్ అయింది.
మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి జోడికి విపరీతమైన పాపులారిటీ ఉంది. వీరిద్దరూ కలిసి చేసిన సాంగ్స్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య సానిహిత్యం పెరిగింది. అది కాస్త ఆ బంధానికి దారి తీసింది. ఇటీవల కాలంలో ఈశ్వర్ సాయి తన భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. ఇది ఆమెలో అనుమానం కలిగించింది. ఇంకేముంది అతని కదలికలను గమనించింది. చివరికి ఆమె అనుమానించింది నిజమైంది. వేములవాడలో వారిద్దరు ఒక హోటల్లో దిగడం ఆమె గుర్తించింది. వారిద్దరు సన్నిహితంగా ఉండగా పట్టుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అసలు విషయాలను బయటపెట్టింది. దీంతో ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ అసలు బాగోతం బయటపడింది.
ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ వ్యవహారం బయటికి రావడంతో ఉప్పల్ బాలు స్పందించాడు. తనదైన శైలిలో వ్యాఖ్యానాన్ని జత చేశాడు..”బాసింగ బలాలు అంటూ పాట పాడాడు. ఉత్త చేతులు ఉత్త చేతులు అంటూ ఊపాడు. చివరికి బెడ్ మీద దొరికిపోయాడు. మీ ఆయన మంచోడా.. మంచోడు అయితే ఇలా ఎందుకు చేస్తాడమ్మా.. మాధురి రాథోడ్ నీకేమైంది. మార్కెట్ లో నీకు ఫుల్ క్రేజ్ ఉంది. అలాంటిది ఇలా ఎందుకు చేశావు.. చివరికి వానితో బెడ్ మీద దొరికిపోయావ్.. ఈశ్వర్ సాయి నీకేమైంది రా.. వివాహం జరిగింది, ఒక బాబు కూడా ఉన్నాడు. దాంతో నీకేం పని.. ఇద్దరూ ఒకే హోటల్ కు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు” అంటూ ఉప్పల్ బాలు తనదైన శైలిలో ప్రశ్నించాడు.. మొగుడు ఏం చేసినా తప్పు లేదా..తప్పు మొత్తం మాధురిదే అన్నట్టుగా మాట్లాడుతున్నావని ఈశ్వర్ సాయి భార్యను ఉద్దేశించి ఉప్పల్ బాటు ప్రశ్నించాడు.
ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఉప్పల్ బాలు ఈ స్థాయిలో స్పందించడం సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీసింది. ఉప్పల్ బాలు ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అగ్ని పరీక్ష 2 కు అతడు హాజరైన తర్వాత తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. దీంతో అతడికి ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు ఏకంగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారాన్ని తనదైన శైలిలో చెప్పడంతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
View this post on Instagram