Homeఎంటర్టైన్మెంట్Venu Swamy: ఆ హీరో, హీరోయిన్ త్వరలోనే చనిపోతారంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!

Venu Swamy: ఆ హీరో, హీరోయిన్ త్వరలోనే చనిపోతారంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!

Venu Swamy: వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే కొంతమంది సెలబ్రిటీలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఏ రేంజ్ నెగెటివిటీ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా తీవ్రమైన నెగెటివిటీ ని సంపాదించుకున్న సెలబ్రిటీలలో ఒకరు వేణు స్వామి. జాతకాల పేరుతో, సున్నితమైన అంశాలపైన కూడా ఈయన చేసే వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పాడు. దురదృష్టం కొద్దీ వాళ్లిద్దరూ విడిపోయారు. తానూ చెప్పిందే […]

Venu Swamy: వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే కొంతమంది సెలబ్రిటీలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఏ రేంజ్ నెగెటివిటీ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా తీవ్రమైన నెగెటివిటీ ని సంపాదించుకున్న సెలబ్రిటీలలో ఒకరు వేణు స్వామి. జాతకాల పేరుతో, సున్నితమైన అంశాలపైన కూడా ఈయన చేసే వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పాడు. దురదృష్టం కొద్దీ వాళ్లిద్దరూ విడిపోయారు. తానూ చెప్పిందే జరిగింది అంటూ, ఆ అంశాన్ని మార్కెటింగ్ చేసుకొని, వేణు స్వామి ఎంత దూరం వెళ్ళాడో అందరికీ తెలిసిందే. ప్రభాస్ కి ఇక జీవితం లో సూపర్ హిట్స్ రావని, 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ సీఎం అవుతాడని, నాగ చైతన్య శోభితలు త్వరలోనే విడిపోతారని, ఇలా ఒక్కటా రెండా ఎన్నో చెప్పుకొచ్చాడు.

ఒక్కటి కూడా నిజం కాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ వచ్చిన వేణు స్వామి, ఇప్పుడు చిన్నగా తన స్వరాన్ని మరోసారి వినిపించేందుకు పావులు కదుపుతున్నాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ’40 ఏళ్ళ లోపు వయస్సు ఉన్న ఒక హీరో త్వరలోనే దురదృష్టం కొద్దీ ఆత్మహత్య చేసుకొని చెనిపోతాడు. కావాలంటే చూడండి , నేను చెప్పింది కచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక హీరోయిన్ కూడా చనిపోయే అవకాశం ఉంది. 2027 నుండి 2028 మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంటుంది. వీళ్లిద్దరు ఆరోగ్యపరమైన సమస్యలతో చాలా కాలం నుండి ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. మేష, వృశ్చిక రాశులకు చెందిన ఈ హీరో , హీరోయిన్ కి కాలం చెల్లింది’ అంటూ వేణు స్వామి పెద్ద అణుబాంబు పేల్చాడు.

ఒకప్పుడు కేవలం పెళ్లి చేసుకునే వాళ్ళు విడిపోతారని చెప్పేవాడు. ఆ తర్వాత రాజకీయాల్లో పలానా నాయకుడు గెలుస్తాడు, పలానా నాయకుడు ఓడిపోతాడు అని చెప్పేవాడు. ఇప్పుడు నేరుగా చావు , పుట్టుకలు వద్దకు వచ్చాడు. గతం లో ఇలాంటి కామెంట్స్ చేసి ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నా కానీ , ఇప్పటికీ ఇతనిలో ఎలాంటి మార్పు లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ వేణు స్వామి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం కోసం కావాలని ఉద్దేశపూర్వకంగా వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper