Homeఎంటర్టైన్మెంట్Toxic Movie Cast Remuneration: 'టాక్సిక్' మూవీలో నటీనటుల రెమ్యూనరేషన్స్ వివరాలు ఇవే..ఇలా అయితే చాలా...

Toxic Movie Cast Remuneration: ‘టాక్సిక్’ మూవీలో నటీనటుల రెమ్యూనరేషన్స్ వివరాలు ఇవే..ఇలా అయితే చాలా కష్టం..

Toxic Movie Cast Remuneration: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ వచ్చే నెల 26 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ వంటివి విడుదలయ్యాయి , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. […]

Toxic Movie Cast Remuneration: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ వచ్చే నెల 26 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ వంటివి విడుదలయ్యాయి , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఇక రీసెంట్ గా విడుదలైన బోల్డ్ రొమాంటిక్ సాంగ్ కి కూడా బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ , ఈ సినిమాకు ఖర్చు అయిన బడ్జెట్ ని చూస్తుంటే , ఇది ఎంత వరకు విడుదల తర్వాత రీకవరీ చేస్తుంది అనే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి.

ఈ చిత్రానికి KVN ప్రొడక్షన్స్ తో పాటు, హీరో యాష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. కాబట్టి ఈయనకు ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ వంటివి ఉండవు , లాభాల్లో వాటాలు పంచుకోవడమే. కానీ ఈ చిత్రం లో నటించిన ఇతర నటీనటులకు మాత్రం రెమ్యూనరేషన్స్ భారీగానే ఇచ్చారట. హీరోయిన్ కియారా అద్వానీ అక్షరాలా 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకోగా , నయనతార 18 కోట్లు తీసుకున్నారట. ఇక కీలక పాత్ర పోషించిన మరో హీరోయిన్ రుక్మిణి వాసంత్ 5 కోట్లు , హ్యూమా ఖురేషీ 3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ చిత్రం లో తారా సుతారియా కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆమెకు కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ , ఇతర టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ అన్నీ కలిపితే 100 కోట్ల రూపాయిల వరకు అయ్యిందని తెలుస్తోంది.

కేవలం రెమ్యూనరేషన్స్ కే ఇంత ఖర్చు అయితే, ఇక సినిమా సెట్స్ కి , భారీ లొకేషన్స్ లో తీసిన సన్నివేశాలకు ఏ రేంజ్ ఖర్చు అయ్యి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. ఇక తెలుగు వెర్షన్ కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు. తెలుగు స్టార్ హీరో సినిమాకు ఎంత అవుతుందో , అంత పెట్టి కొన్నారట దిల్ రాజు. కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అవసరం. ఒకవేళ రాకపోతే భారీ నుండి అతి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper