Homeఎంటర్టైన్మెంట్Funky Collection Day 2: 2వ రోజు అనేక ప్రాంతాల్లో నెగెటివ్ షేర్స్ ..డబుల్...

Funky Collection Day 2: 2వ రోజు అనేక ప్రాంతాల్లో నెగెటివ్ షేర్స్ ..డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఫంకీ’ మూవీ!

Funky Collection Day 2: విశ్వక్ సేన్(Vishwak Sen) మరో సారి అడ్డంగా దొరికిపోయాడు. ‘లైలా’ చిత్రం ఫ్లాప్ తో ఈ కుర్ర హీరో చాలా డీలా పడ్డాడు. ఎదో కొత్తగా ప్రయత్నం చేశా, ఆడియన్స్ ఈ రేంజ్ లో రిజెక్ట్ చేశారేంటి? అంటూ చాలా బాధపడ్డాడు విశ్వక్ సేన్. ఇక మీదట మిమ్మల్ని నిరాశ పర్చకుండా, మీతో మాటలు అనిపించుకోకుండా మంచి సినిమాలు చేస్తానంటూ బహిరంగ లేఖ కూడా రాశాడు. ఈ క్రమం లోనే ఆయన […]

Funky Collection Day 2: విశ్వక్ సేన్(Vishwak Sen) మరో సారి అడ్డంగా దొరికిపోయాడు. ‘లైలా’ చిత్రం ఫ్లాప్ తో ఈ కుర్ర హీరో చాలా డీలా పడ్డాడు. ఎదో కొత్తగా ప్రయత్నం చేశా, ఆడియన్స్ ఈ రేంజ్ లో రిజెక్ట్ చేశారేంటి? అంటూ చాలా బాధపడ్డాడు విశ్వక్ సేన్. ఇక మీదట మిమ్మల్ని నిరాశ పర్చకుండా, మీతో మాటలు అనిపించుకోకుండా మంచి సినిమాలు చేస్తానంటూ బహిరంగ లేఖ కూడా రాశాడు. ఈ క్రమం లోనే ఆయన ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ KV తో ‘ఫంకీ'(Funky Movie) చిత్రాన్ని ఒప్పుకోగానే విశ్వక్ సేన్ కం బ్యాక్ లోడింగ్ అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఈ చిత్రం డబుల్ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఏ మాత్రం సరిపోని ఆరంభం అనే చెప్పాలి.

ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగింది. ఆ రేంజ్ బిజినెస్ జరిగిన సినిమాకు కనీసం నాలుగు కోట్ల రూపాయిల రేంజ్ లో ఓపెనింగ్స్ రావాలి. కానీ ఈ చిత్రానికి అందులో సగం వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండవ రోజు వాలెంటైన్స్ డే కదా, ఈ సినిమాకు కచ్చితంగా కలిసొస్తుందని అంతా అనుకున్నారు. కానీ నేడు విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ‘ఫంకీ’ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండవ రోజు మొదటి రోజు కంటే తక్కువ వసూళ్లు వచ్చే లాగా కనిపిస్తున్నాయి. అంటే కోటి రూపాయిల కంటే తక్కువ షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వస్తాయని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా వసూళ్లు బాగా పడిపోయాయి.

ఓవరాల్ రెండవ రోజున రెండు కోట్ల రూపాయిల కంటే తక్కువ షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈ చిత్రం ఊహించిన దానికంటే పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని అంటుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, వీకెండ్ ముగిసిపోయేసరికి ఈ చిత్రం కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సోమవారం రోజున శివ రాత్రి కాబట్టి, ఆ రోజున సెలవు కాబట్టి మరో నాలుగు రోజులకు కలిపి 7 కోట్ల 50 లక్షలు రావొచ్చని, క్లోజింగ్ పది కోట్లు రావొచ్చని, అదే కనుక జరిగితే ఈ చిత్రాన్ని డబుల్ డిజాస్టర్ గా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper