Tanuja Divvela Divvela Madhuri: తిరుమల తిరుపతి కొండపై ఈమధ్య కాలం లో సెలబ్రిటీలను అసలు అదుపు చేయలేకపోయాము. ఒకరి తర్వాత ఒకరు అపచార కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. రీసెంట్ గానే హీరోయిన్ శివానీ నాగారం , యూట్యూబర్ గీతూ రాయల్ వంటి వారు తిరుమల కొండపై రీల్స్ చేస్తూ అపచారానికి ఒడిగట్టారు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘బిగ్ బాస్ 9’ రన్నరప్ తనూజ, ఆ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దివ్వెల మాధురి చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. నిన్న తనూజ పుట్టినరోజు కావడంతో, ఆమె దివ్వెల మాధురి తో కలిసి తిరుమలకి వెళ్ళింది. అక్కడ అతిథి గృహం లో దిగిన వీళ్లిద్దరు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేస్తూ , వీడియో ని షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో పెద్ద దుమారమే రేపుతోంది.
తిరుమల పవిత్రతను కాపాడే విధంగా కొండప్రాంగణంలో ఇలాంటివి చేయడాన్ని టీటీడీ ఎప్పుడో నిషేదించింది. కానీ నిబంధనలకు విరుద్ధం గా వీళ్ళిద్దరూ ఈ పని చేయడమే కాకుండా, అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం పై టీటీడీ ఇప్పుడు ఫైర్ అయ్యింది. తిరుమల కొండపై కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయడం వంటివి నిషేధం , భక్తుల మనోభవాలను దెబ్బ తీస్తూ ఇలాంటి పనులు చేయడం సరైన పద్దతి కాదు. కేవలం పబ్లిసిటీ కోసం పవిత్రమైన తిరుమల క్షేత్రం పవిత్రతని వాడుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనూజ , దివ్వెల మాధురి లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపటాడ్డం మొదలు పెట్టింది. పోలీసులు కూడా వీళ్లిద్దరి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
ఈ విషయం పై నెటిజెన్స్ స్పందిస్తూ , ఈమధ్య కాలం లో సెలబ్రిటీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు, కచ్చితంగా ఒకరి పైన అయినా చర్యలు తీసుకోవాలి , లేదంటే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉంటాయి అంటూ మండిపడుతున్నారు. ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖాయమంత్రి పవన్ కళ్యాణ్ లు కూడా తిరుమల కొండపై ఈమధ్య కాలం లో జరుగుతున్న ఇలాంటి ఘటనలు గమనిస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇకపోతే తనూజ , దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లో బాగా దగ్గరైన సంగతి మన అందరికీ తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు స్నేహం గానే ఉన్నారు. కానీ అవగాహనా లేకుండా చేశారో , లేదా తెలిసి చేశారో తెలియదు కానీ, ఈ చర్య పై కచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే అని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.