Homeఎంటర్టైన్మెంట్Priyanka Chopra Varanasi Movie experience: 'వారణాసి' లో ఆ అనుభూతిని జీవితంలో ఎప్పటికీ ...

Priyanka Chopra Varanasi Movie experience: ‘వారణాసి’ లో ఆ అనుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను: ప్రియాంక చోప్రా

Priyanka Chopra Varanasi Movie experience: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ ప్రస్తుతం జార్జియా లో జరుగుతోంది. మహేష్ బాబు రీసెంట్ గానే ఆ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వచ్చాడు. ఆయనపై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించారు. సెప్టెంబర్ నెల లోపు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి […]

Priyanka Chopra Varanasi Movie experience: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ ప్రస్తుతం జార్జియా లో జరుగుతోంది. మహేష్ బాబు రీసెంట్ గానే ఆ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వచ్చాడు. ఆయనపై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించారు. సెప్టెంబర్ నెల లోపు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి . ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఈ సినిమా షూటింగ్ సమయం లో తనకు ఎదురైనా కొన్ని అనుభూతుల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘కెన్యా అడవుల్లో వేల సంఖ్యలో జింకలు కదులుతున్న సమయంలో , వాటి మధ్యలో నిలబడి షూటింగ్ చేయడం అనేది నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. వాటి ముఖాలు చూస్తుంటే ఎదో తెలియని ఫీలింగ్ కలిగింది. ఈ జీవులు ఎన్నో వేల ఏళ్ళ నుండి ఈ భూమి మీద ఎలా మనుగడ సాగిస్తున్నాయి కళ్ళకు కనిపించింది. ప్రకృతి ఎంత శక్తివంతమైందో, ఈ భూమి పై ఉండే జీవ పరిణామం ఎంత ఉన్నతమైనదో , వాటిని చూస్తే తెలిసొచ్చింది ‘ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ కెన్యా షెడ్యూల్ జరిగింది. ఆమె చెప్తున్న మాటలను బట్టీ చూస్తుంటే ఈ చిత్రాన్ని రాజమౌళి ఎంతటి విజువల్ ఫీస్ట్ గా తీర్చి దిద్దబోతున్నాడో తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటేనే రాజమౌళి ప్రాణం పెట్టి పని చేస్తాడు. అద్భుతమైన విజువల్స్ ని అందించడానికి తన వైపు నుండి నూటికి వెయ్యి శాతం కృషి చేస్తాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఆయన ఏ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడో ఊహించుకోవచ్చు.

ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కాకుండా ఆయన శ్రీ రాముడి గా ఈ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటో ని కూడా విడుదల చేస్తారట , ఆరోజు అభిమానులకు ఈ విజువల్ ఫీస్ట్ ఉండబోతుంది. ఏప్రిల్ 7 న విడుదల అవ్వబోయే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ అయ్యి , రాజమౌళి విజన్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper