Homeఎంటర్టైన్మెంట్Baby Movie: ఆ సీన్లు సినిమా నుంచి తీయడం కుదరదు… హైదరాబాద్ సీపీని కలిసిన ‘బేబి’...

Baby Movie: ఆ సీన్లు సినిమా నుంచి తీయడం కుదరదు… హైదరాబాద్ సీపీని కలిసిన ‘బేబి’ దర్శకుడు.

డ్రగ్స్ ఎలా తీసుకోవాలో తెలిపే విధంగా, మాదకద్రవ్యాలను ప్రోత్సహించే విధంగా ‘బేబి’ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ‘బేబి’ సినిమాలో సన్నివేశాలకు.

Baby Movie: ఆనంద్ దేవరకొండ, వీరాజ్, వైష్ణవి చైతన్యలు హీరో హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమా ఈ మధ్యకాలం విడుదలైన చిత్రాలలో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటిలో రిలీజై అక్కడ కూడా సందడి చేస్తోంది.

కాగా ఈ సినిమా విడుదలై చాలా రోజులు అయిన తర్వాత హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న ముఠాను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను గురువారం పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సీవీ ఆనంద్ ‘బేబి’ సినిమాపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్ ఎలా తీసుకోవాలో తెలిపే విధంగా, మాదకద్రవ్యాలను ప్రోత్సహించే విధంగా ‘బేబి’ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ‘బేబి’ సినిమాలో సన్నివేశాలకు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సీన్ మెమోలో పేర్కొన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దృశ్యాలకు పెద్దగా తేడా ఏమీ లేదని చెప్పారు. కాబట్టి, ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలను చిత్రీకరించవద్దని చిత్ర పరిశ్రమకు సూచించారు. ఈ విషయంలో ‘బేబి’ సినిమా నిర్మాతలకు నోటీసులు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇకపై సినిమాలపై ఫోకస్ పెడతామని.. డ్రగ్స్ వాడకం సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్ అవ్వగానే చిత్ర దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ అప్రమత్తమయ్యారు. సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించిన కార్యాలయానికి వెళ్లి ఆయన్ని కలిశారు. సినిమాలో డ్రగ్స్ వాడుతున్న సన్నివేశాలను పెట్టడంపై వివరణ ఇచ్చారు.

కాగా సివి ఆనంద్ ని కలిసిన అనంతరం సాయి రాజేష్ మీడియాతో మాట్లాడారు. ‘బేబి’ సినిమాలో డ్రగ్స్ సన్నివేశాలను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసులు వివరణ అడిగారని వెల్లడించారు. కథలో భాగంగానే ఆ సన్నివేశంలో డ్రగ్స్‌ వాడకం పెట్టాల్సి వచ్చిందని కమిషనర్‌కు వివరించామని చెప్పారు. సెన్సార్ పూర్తయిపోయిన సినిమాలో నుంచి ఇప్పుడు ఆ సన్నివేశాలు తీసేయలేమని స్పష్టం చేశారు. ‘ఈ సినిమాలో మంచి చెప్పాను. ఆ మంచి చెప్పాల్సి వస్తే మళ్లీ ఇలాంటి సీన్లు తీస్తాను. డ్రగ్స్ వాడొద్దనే చెప్తాను’ అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper