spot_img
Homeఎంటర్టైన్మెంట్ప్రేమతో చెబితే వాళ్ళు వింటారు

ప్రేమతో చెబితే వాళ్ళు వింటారు

Sonu Sood
ఢిల్లీ వేదికగా రైతుల ఉద్యమం నడుస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు అనేక రోజులుగా కేంద్రంపై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులతో కేంద్రం చర్చలు జరిపినా పరిష్కారం లభించలేదు. రోడ్ల పక్కనే వంటా వార్పు చేసుకుంటూ… అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికే 20మంది రైతులు ఈ ఉద్యమంలో మరణించినట్లు తెలుస్తుంది.

Also Read: మెగా ఫ్యామిలీ నుండి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’

కాగా ఈ రైతు ఉద్యమంపై నటుడు సోనూ సూద్‌ స్పందించారు. రైతుల దుస్థితికి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ డైలీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సోనూ సూద్… అన్నదాతల దుస్థితి చూసి వేదనకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితికి ఎవరు కారణం అని నేను అడగడం లేదు. రైతుల సమస్యలను పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నాను అన్నారు. నేను కూడా పంజాబ్‌లో పుట్టాను, రైతులతో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రేమతో చెబితే వారు వింటారని సోనూ సూద్ తెలిపారు. ఈ ఉద్యమంలో రైతులు ప్రాణాలు కోల్పోయారు. పంటపొలాల్లో విత్తనాలు నాటుతూ ఉండాల్సిన సమయంలో.. అన్నదాతలు తమ పిల్లలతో రోడ్లపై చలితో వణుకుతూ గడపుతున్నారు. ఇంకా ఎంత కాలం వాళ్లు ఈ దుస్థితి ఎదుర్కోవాలి … అని ఆవేదన వ్యక్తంచేశారు.

Also Read: మహేష్ గురించి ఆసక్తికర విషయాలని బయటపెట్టిన అడివిశేష్

ఇక కరోనా సమయంలో వందల మంది కార్మికులను తమ స్వగ్రామాలకు వాహనాలు సమకూర్చి పంపారు సోనూ సూద్. అలాగే సోషల్ మీడియా వేదికగా ఎవరు తమ సమస్యను విన్నవించుకున్నా, అడిగిందే తడవుగా సాయం చేస్తున్నారు. కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ సాయం చేయడం కోసం తన ఆస్తులు పది కోట్లకు తాకట్టు పెట్టారని సమాచారం. సోనూ సూద్ కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక తెలుగులో ఆచార్య చిత్రంతో పాటు, అల్లుడు అదుర్స్ చిత్రాలలో సోనూ సూద్ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...
Oktelugu Epaper