Homeఎంటర్టైన్మెంట్Nani The Paradise: ప్యారడైజ్ సినిమాలో నాని వాటా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

Nani The Paradise: ప్యారడైజ్ సినిమాలో నాని వాటా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

Nani The Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల ఎక్కువైపోయింది.చిన్న సినిమాలతో వాళ్లు సత్తా చాటుతున్నారు. ఇక మీడియం రేంజ్ హీరోలు కూడా భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు. ఇక న్యాచురల్ స్టార్ గా అవతరించిన నాని లాంటి హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమా చేసిన కూడా రానటువంటి గుర్తింపు నాని కి వచ్చింది. ప్రతి సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంటూ […]

Nani The Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల ఎక్కువైపోయింది.చిన్న సినిమాలతో వాళ్లు సత్తా చాటుతున్నారు. ఇక మీడియం రేంజ్ హీరోలు కూడా భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు. ఇక న్యాచురల్ స్టార్ గా అవతరించిన నాని లాంటి హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమా చేసిన కూడా రానటువంటి గుర్తింపు నాని కి వచ్చింది. ప్రతి సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయన చేసిన సినిమాలు మినిమం గ్యారంటి సినిమాలుగా మారుతున్నాయి. దసర సినిమాతో మాస్ అవతారం ఎత్తిన నాని ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెనుతిరిగి చూడలేదు. అప్పటి నుంచి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నప్పటికి నాని ఈ సినిమాలో రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటాను అడిగినట్టుగా తెలుస్తుంది. లేదంటే నైజాం ఏరియా మొత్తాన్ని తనకు ఇవ్వాలని కోరుతున్నాడట. దాని ద్వారా నైజాంలో వచ్చే కలెక్షన్స్ మొత్తం తనే దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఏకంగా నైజాం ఏరియాలో ప్యారడైజ్ సినిమాకి మంచి గుర్తింపు ఉంది. నిజానికి శ్రీకాంత్ ఓదెల సినిమాలన్నింటికి తెలంగాణలో భారీ క్రేజ్ దక్కుతుంది. కాబట్టి నైజాం ఏరియా తీసుకుంటే నాని కి భారీ లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

ఇక ఏది ఏమైనా కూడా నాని లాంటి స్టార్ హీరో చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. అలాగే ఈ సినిమాతో నాని ఎలాంటి లాభాలను సంపాదిస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper