spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: 20 ఏళ్లుగా మహేష్ తో సినిమా కోసం స్టార్ డైరెక్టర్ వెయిటింగ్?

Mahesh Babu: 20 ఏళ్లుగా మహేష్ తో సినిమా కోసం స్టార్ డైరెక్టర్ వెయిటింగ్?

Mahesh Babu: టాలీవుడ్ లోనే అగ్రహీరో మహేష్ బాబు. ఆయనతో సినిమా కోసం ఎంతో మంది దర్శకులు కథలో క్యూలో ఉంటారు. ఆయన అంగీకరించడం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. మంచి కథా కథనాలను ఎంచుకొని మహేష్ బాబు హిట్స్ కొడుతుంటాడు.

తాజాగా ‘సర్కారువారి పాట’ చిత్రంతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో అలరిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు చేతిలో చాలా పెద్ద ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా త్వరలో చేయబోతున్నాడు. ఆ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీని చేయబోతున్నాడు. మరో ఐదేళ్ల పాటు మహేష్ బాబు డైరీలో ఖాళీ లేదు.ఒక సంవత్సరం త్రివిక్రమ్ మూవీకి కేటాయిస్తే రాజమౌళి సినిమాకు ఎంత లేదన్నా ఓ రెండేళ్లు పడుతుంది. సో మరో ఐదేళ్ల పాటు మహేష్ బాబు మరో సినిమా చేయడం కష్టమే.

అయితే టాలీవుడ్ లో ఒక దర్శకుడు మాత్రం మహేష్ బాబు కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్లుగా ఎదురుచూస్తేనే ఉన్నాడు. ఈ ఆశ్చర్యకర విషయాన్ని తాజాగా ఆ దర్శకుడే బయటపెట్టాడు.కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో అందెవేసిన చేయిగా ఉన్న దర్శకుడు సముద్ర తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు.

సింహరాశి, శివరామరాజు, మహానంది, ఎవడైతే నాకేంటి వంటి సూపర్ హిట్ సినిమాలు దర్శకుడు సముద్ర ఖాతాలో ఉన్నాయి. మహేష్ బాబు వరుస ఫ్లాప్ ల తర్వాత ‘ఒక్కడు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ సమయంలో మహేష్ తో సినిమా చేయడానికి చాలా మంది ఎగబడ్డారు.ఈ క్రమంలోనే దర్శకుడు సముద్ర కూడా తనకు బాగా తెలిసిన ప్రకాష్ రాజ్ ద్వారా మహేష్ బాబును కలిశాడు. మహేష్ కు సముద్ర తన కథను వినిపించాడు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ కథ మహేష్ బాబుకు బాగా నచ్చేసింది. కథ పూర్తిగా మాస్, యాక్షన్ తో నిండి ఉండడమే.

కానీ అప్పుడు నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ వారు బడ్జెట్ ఎక్కువైందని వెనక్కి తగ్గడంతో అలా మహేష్-సముద్ర సినిమా పట్టాలెక్కలేదు. అయితే మహేష్ బాబుతో టచ్ లోనే సముద్ర ఉన్నాడట.. వరుసగా నిజం నుంచి ఖలేజీ వరకూ మహేష్ బాబును కలుస్తూ సినిమా కోసం ప్రయత్నించాడు.

అయితే మహేష్ బాబు తర్వాత బ్లాక్ బస్టర్స్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి కథలకు మంగళం పాడారు. ఇప్పుడు స్టార్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఎప్పుడు కలిసినా ‘కథ ఇంకా ఏదైనా ఉందా? అని అడుగుతున్నాడని’ సముద్ర తెలిపారు. అయితే వరుస ఫ్లాప్ లతో సముద్రకు ఇప్పుడు బ్యాడ్ టైం రావడంతో మహేష్ చాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. ఒక్క హిట్ ఇచ్చి ఇంకోసారి మహేష్ ను కలుస్తానని అంటున్నారు. మరి ఈయన కల నిజం అవుతుందా? లేదా ? అన్నది చూడాలి.
Recommended Videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper