Swayambhu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళలో మన స్టార్ హీరోలు ముందు వరుసలో ఉన్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది యంగ్ హీరోలు సైతం స్టార్ హీరోల బాటపడుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం… ‘కార్తీకేయ 2’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టిన నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం ‘స్వయంభు’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు…
ఇప్పటివరకు నిఖిల్ సిద్దార్థ్ సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఈరోజు టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగు సినిమాలన్నింటిని కలిపి ఈ సినిమాను తీశారు అనే డౌట్ మనకు కలుగుతుంది.
ఇక ఈ విషయం మీద మేకర్స్ ఎలాంటి స్పందనను తెలియజేయనప్పటికి విమర్శకులు మాత్రం ఈ సినిమా మీద భారీ విమర్శలైతే చేస్తున్నారు…ఇక ఎందుకని అలాంటి ఇతర సినిమాల రిఫరెన్స్ లు తీసుకున్నారనేది ఎవరికి అర్థం కావడం లేదు. మగధీర, బాహుబలి లాంటి భారీ రేంజే సినిమాల ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది… మరి ఆ సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక గత సంవత్సరం తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘మిరాయి’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సైతం ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాను పురాణాలతో లింకు చేసి మరీ తెరకెక్కిస్తున్నారు… ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది. నిఖిల్ ను పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలబెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…