Nikhil Siddharth : తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలని తపన పడే హీరోలలో ఒకడు నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth). ‘హ్యాపీ డేస్’ సినిమాతో మొదలైన ఈ కుర్ర హీరో కెరీర్, ఇంత పీక్ రేంజ్ కి చేరుకుంటుందని ఎవ్వరూ అప్పట్లో ఊహించలేదు. ‘హ్యాపీ డేస్’ తర్వాత స్క్రిప్ట్స్ ఎంపిక విషయం లో కాస్త తడబాటు కారణంగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి కానీ, ‘స్వామి రారా’ చిత్రం నుండి నిఖిల్ తన స్క్రిప్ట్ సెలక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆడియన్స్ కి రుచి చూపించాడు. ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించిన నిఖిల్, ఆ తర్వాత 18 పేజెస్, ‘స్పై’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఎదురుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ‘స్వయంభు’ అనే భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రాన్ని చేస్తున్నాడు.
Also Read : కేవలం 2 సినిమాలే చేసింది.. కానీ ప్రస్తుతం రూ. 4600 కోట్లు ఆస్తి ఉన్న ధనిక హీరోయిన్.. ఎవరో తెలుసా…
భరత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. సంయుక్త మీనన్(Samyuktha Menon), నభా నటేష్(Nabha Natesh) ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే నిఖిల్ మార్కెట్ పరిధిని మించి ఈ చిత్రం కోసం చాలా బడ్జెట్ ఖర్చు చేసారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల అవ్వబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కొన్ని సినిమాల్లో మైథాలజీ కి సంబంధించిన కొన్ని అంశాలను జోడించిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. కర్హికేయ 2 , హనుమాన్, కల్కి వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ‘స్వయంభు'(Swayambhu Movie) చిత్రం లో కూడా అలా మన మైథాలజీ కి సంబంధించిన అంశాలు ఉన్నాయట.
రామాయణం లో శ్రీ రాముడు వారు శ్రీలంక లో రావణుడి బందీ లో ఉన్నటువంటి సీతను తీసుకొచ్చేందుకు వానరులు ‘రామ సేతు'(Ram Setu) బ్రిడ్జ్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఎన్నో పుస్తకాల్లో చదివాము, అదే విధంగా ఎన్నో సినిమాలు, సీరియల్స్ ద్వారా మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము. కానీ అవన్నీ ఒత్తి కథలే అని నమ్మే వాళ్లకు, అది కథలు కాదని, నిజమేనాని ఇస్రో శాస్త్రవేత్తలు సైతం ఆధారాలతో బయటపెట్టారు. ‘స్వయంభు’ చిత్రం లో రామసేతు కి సంబంధించిన అంశాలు చాలానే ఉంటాయట. అసలే పీరియడ్ జానర్ లో తెరకెక్కుతున్న చిత్రం, దానికి తోడు రామసేతు అంశం, డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయం లో పర్ఫెక్ట్ గా జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే మాత్రం ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు వస్తాయి. మరి ఆ రేంజ్ లో సినిమా ఉంటుందో లేదో చూడాలి.
Also Read : ఒప్పుకున్న సినిమాల నుండి తప్పుకుంటున్న కియారా అద్వానీ..నిర్మాతలకు కోట్లలో నష్టం..అకస్మాత్తుగా ఏమైంది?