Homeఎంటర్టైన్మెంట్Nikhil satire on Naga Bandham teaser: 'నాగ బంధం' టీజర్ పై హీరో నిఖిల్...

Nikhil satire on Naga Bandham teaser: ‘నాగ బంధం’ టీజర్ పై హీరో నిఖిల్ సెటైర్లు..వైరల్ అవుతున్న ట్వీట్!

Nikhil satire on Naga Bandham teaser: శివరాత్రి సందర్భంగా నిన్న విడుదలైన ‘నాగ బంధం'(Nagabandham Movie) సినిమా టీజర్ పై హీరో నిఖిల్(Nikhil Siddartha) ట్విట్టర్ లో సెటైర్లు వేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు నిఖిల్ ఇలా సెటైర్లు వేసాడు?, అసలు ఏమైంది అంటూ ఆరాలు తీస్తున్నారు. ‘నాగ బంధం’ మూవీ నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామా గతంలో నిఖిల్ తో ‘కార్తికేయ 2’ అనే చిత్రం […]

Nikhil satire on Naga Bandham teaser: శివరాత్రి సందర్భంగా నిన్న విడుదలైన ‘నాగ బంధం'(Nagabandham Movie) సినిమా టీజర్ పై హీరో నిఖిల్(Nikhil Siddartha) ట్విట్టర్ లో సెటైర్లు వేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు నిఖిల్ ఇలా సెటైర్లు వేసాడు?, అసలు ఏమైంది అంటూ ఆరాలు తీస్తున్నారు. ‘నాగ బంధం’ మూవీ నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామా గతంలో నిఖిల్ తో ‘కార్తికేయ 2’ అనే చిత్రం చేశాడు. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. తన కెరీర్ కి అంత పెద్ద బూస్ట్ ఇచ్చిన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత చిత్రాన్ని ఎందుకు నిఖిల్ ఇలా ట్రోల్ చేస్తున్నాడు?, ఆ చిత్ర నిర్మాతలతో ఆయనకు సఖ్యత లేదా?, రెమ్యూనరేషన్ విషయం లో వాళ్ళతో ఏమైనా గొడవలు జరిగాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నిఖిల్ వేసిన ట్వీట్ ఏంటో చూద్దాం.

నిఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వయంభు’ కి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చేశారు మేకర్స్. కొన్ని టెక్నీకల్ లోపాలు కారణంగా, సినిమా స్కోప్ వెర్షన్ ‘స్వయంభు’ టీజర్ ని యూట్యూబ్ నుండి తొలగించి కొత్తగా రీ అప్లోడ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిని హీరో నిఖిల్ క్వాట్ చేస్తూ ‘యూట్యూబ్..ఎందుకు అయ్యా మాకు ఈ టెక్నీకల్ లోపాలు ఇస్తావ్. మీకోసం అద్భుతమైన క్వాలిటీ తో టీజర్ ని మళ్లీ అప్లోడ్ చేశాము చూడండి’ అంటూ టీజర్ ని అప్లోడ్ చేశాడు. అంతటి తో ఆగకుండా ‘ముఖ్య గమనిక..మా టీజర్ లోని షాట్స్ కోసం రీసెంట్ గా విడుదలైన టీజర్ లాగా ఎలాంటి AI ని ఉపయోగించలేదు. నిజమైన విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన సినిమా మాది’ అంటూ కౌంటర్లు ఇచ్చాడు నిఖిల్.

రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ లో లాగా AI షాట్స్ ని ఉపయోగించలేదు అంటే, రీసెంట్ గా విడుదలైంది ‘నాగ బంధం’ టీజర్ యే. దాని మీదనే ఈయన సెటైర్లు వేసినట్టు తెలుస్తోంది. నిఖిల్ కి ఇలా సెటైర్లు వేయడం కొత్తేమి కాదు, గతం లో హీరో విజయ్ దేవరకొండ పై కూడా ఆయన చాలా సెటైర్లు వేసాడు. అందుకు విజయ్ దేవరకొండ వైపు నుండి కూడా కౌంటర్లు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా తనకు కెరీర్ లో మైల్ స్టోన్ లాగ నిలిచిపోయిన సినిమాని అందించిన నిర్మాతలపై సెటైర్లు వేస్తున్నాడు. ఇకపోతే ‘స్వయంభు’ చిత్రం టీజర్ కి సోషల్ మీడియా నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. టీజర్ లో VFX షాట్స్ బాగాలేవు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. అందుకే సరికొత్త వెర్షన్ టీజర్ ని అప్లోడ్ చేశారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper