అక్కినేని మూడో తరం నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్, హీరోగా నిలబడటానికి చాల ప్రయత్నాలు చేసినా ఇంకా తనకంటూ ఓ సొంత మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకోలేకపోయాడు. అయితే, సుమంత్ కి సాఫ్ట్ హీరోగా ఒక ఇమేజ్ అయితే ఉంది. కానీ వయసు కూడా పై పడడంతో ఇక ఇతగాడికి సీనియర్ హీరో హోదా వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఇంకా లవ్ స్టోరీలు చేస్తే దరిద్రంగా ఉంటుంది.
అందుకే ప్రస్తుతం సుమంత్ వెరైటీ పాత్రల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇటీవల ఒక సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించి అలరించిన సుమంత్, ఈ సారి మరో సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఏమిటంటే రౌడీ క్యారెక్టర్. అందుకే తన గెటప్ అండ్ లుక్స్ ను సుమంత్ పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’. మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావడం విశేషం. అన్నట్టు ఈ సినిమాలో సుమంత్ లుక్ తో పాటు యాస కూడా వైవిధ్యంగా ఉంటుందట.
విశాఖపట్నంలోని వాల్తేరు శీను అనే రౌడీగా నటిస్తున్న సుమంత్ అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుందని, ఈ సినిమాతో సుమంత్ కి మాస్ హీరో ఇమేజ్ రావడం ఖాయం అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సుమంత్ సరసన ఐమా నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sumanth mass look adurs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com