
బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో గంగానది, యమునా నదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటన మరిచిపోక ముందే మరోసారి ఉత్తరాఖండ్ లోని ఓ నదిలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. పిథోర్ గడ్ జిల్లాలోని సరయూ నదిలో డజన్ల కొద్దీ మృతదేహాలు తేలుతూ కనిపించాయి. మృతదేహాలు కరోనా మృతులవేనంటూ స్థానికంగా ఆందోళనకు గురవతున్నారు. మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి 30 కిలో మీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంది.