tiger shroff : సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది. గతంలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులకు ఎందుకు పాల్పడింది. చివరికి సల్మాన్ ఖాన్ విపరీతమైన సెక్యూరిటీతో బయటికి వెళ్లే భయానకమైన పరిస్థితిని ఎందుకు కల్పించింది.. దీని వెనక అసలు ఏముంది.. సల్మాన్ ఖాన్ ఏం చేశారు.. లారెన్స్ గ్యాంగ్ ఎందుకు ఈ స్థాయిలో ప్రతీకారంతో రగిలిపోతుంది.. దీని వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది..
లారెన్స్ గ్యాంగ్ లో ఉన్న వ్యక్తులకు కృష్ణ జింక అంటే చాలా ఇష్టం. కృష్ణ జింకను వారు తల్లి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. పైగా గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ అభియోగాలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతూనే ఉంది. తమ జాతికి చిహ్నమైన.. తమకు తల్లి లాంటిదైన కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ ఇలా వేటాడడం లారెన్స్ గ్యాంగ్ కు అసలు నచ్చలేదు. అందువల్లే వారు టార్గెట్ చేశారు. అప్పటినుంచి సల్మాన్ ఖాన్ ను ఏదో విధంగా భయపెడుతూనే ఉన్నారు. మొదట్లో లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ సినిమాల మీద నెగిటివ్ ప్రచారం చేసేది. ఆ తర్వాత లారెన్స్ గ్యాంగ్ జైలు వెళ్లడంతో కొద్దిరోజులపాటు సల్మాన్ ఖాన్ మీద దృష్టి పక్కన పెట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మొదలు పెట్టింది. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ విషయంలో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది లారెన్స్ గ్యాంగ్.
లారెన్స్ జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన జైలు నుంచి తన అనుచరుల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడే వారిని టార్గెట్ చేస్తున్నారు. ఒక దశలో వారిని చంపేస్తున్నారు కూడా. సల్మాన్ ఖాన్ విషయంలో లారెన్స్ గ్యాంగ్ కు కోపం రావడానికి కూడా కారణం ఇదే. అందువల్లే ఈ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్ నటుడి ఇంటి ముందు కాల్పులు జరిపారంటే.. లారెన్స్ గ్యాంగ్ దూకుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జైల్లో ఉన్నప్పటికీ కూడా నెట్వర్క్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు అంటే.. వాళ్లకు బయట ఉన్న శక్తులు.. జైలు లోపల సహకరిస్తున్న వ్యక్తులు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు.
కృష్ణ జింకను లారెన్స్ గ్యాంగ్ జాతీయులు అత్యంత ప్రేమగా చూసుకుంటారు. కృష్ణ జింకను తమ మాతృమూర్తి లాగా భావిస్తుంటారు. అందువల్లే సల్మాన్ ఖాన్ ను వారు టార్గెట్ చేశారు. అయితే గతంలో తన ఇంటి వద్ద దాడులు జరిగిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీని మరింత పెంచుకున్నారు. ప్రభుత్వం కూడా ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తోంది. సినిమా షూటింగ్లో విషయంలో.. బిగ్ బాస్ షూటింగ్ సమయంలో భారీగా అంగరక్షకుల మధ్య సల్మాన్ ఖాన్ వస్తున్నారు. సల్మాన్ ఖాన్ కల్నల్ సంతోష్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న గాల్వాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది.