Deepika Padukone: షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా నార్త్ లోను అలానే సౌత్ లోనూ కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపుతోంది. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా తన సత్తా చాటాడు. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ తో పాటు నయనతార, దీపికా పడుకొనే, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలో కనిపించి మెప్పించారు.
దీపికా పడుకొనే.. షారుఖ్ ఖాన్.. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత మరోసారి కలిసి నటించిన సినిమా ఇది. కాగా ఈ సినిమాలో దీపిక చాలా తక్కువ సేపే మనకు కనిపిస్తుంది. ఇక ఆ చిన్న క్యారెక్టర్ కోసం దీపికా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే తప్పకుండా అందరూ షాక్ అవ్వాల్సిందే.
ఈ సినిమాలో సంజయ్ దత్ అలానే దీపికా పడుకొనే ఇద్దరు కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించారు. అయితే అతిథి పాత్ర చేసినందుకుగాను బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ఏకంగా 15 కోట్ల పారితోషకం తీసుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇదే విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఇటీవల ఈ విషయంపై స్పందించింది దీపిక పదుకొనే. తాను అతిథి పాత్రలకు ఎలాంటి డబ్బులు వసూలు చేయను అంటూ దీపిక చెప్పుకొచ్చింది. గతంలో రణవీర్ సింగ్ 83, సర్కస్ అనే సినిమాల్లో కనిపించిన దీపిక.. ఆ సినిమాలకు కూడా ఏమి పారితోషకం తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక షారుక్ ఖాన్ కోసం ఏదైనా స్పెషల్ అపీరియన్స్ వచ్చిన నేను చేస్తాను. గతంలో రోహిత్ శెట్టితో కూడా అలాగే చేశాను అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
కాగా ఆ చిన్న క్యారెక్టర్ కోసం దీపికా 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంది అన్నప్పుడు ప్రజలు ఎంత షాకీ గురయ్యారో ఇప్పుడు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ సున్నా అని తెలిసినప్పుడు కూడా అంతే షాకీ గురవుతున్నారు. ఎందుకంటే అంత పాపులారిటీ ఉన్న హీరోయిన్ షారుక్ ఖాన్ తో ఉండే స్నేహబంధం వల్ల అసలు ఏమి తీసుకోకుండా ఆ రోల్ చేయడం గొప్ప విషయమే అంటూ షాప్ కి గురవడమే కాకుండా పోస్టులు కూడా వేస్తున్నారు అభిమానులు.