Homeఎంటర్టైన్మెంట్Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు...

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను వాళ్ళు రాసుకొని ప్రేక్షకులు మెప్పించే విధంగా మంచి కథలతో రంగంలోకి దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎనర్జిటిక్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ పోతినేని సైతం తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ […]

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను వాళ్ళు రాసుకొని ప్రేక్షకులు మెప్పించే విధంగా మంచి కథలతో రంగంలోకి దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎనర్జిటిక్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ పోతినేని సైతం తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాతో ప్లాప్ ని మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం సైతం ఇప్పుడు తన ఓన్ డైరెక్షన్ లో ఒక సినిమాకి డైరెక్షన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. చెన్నై లవ్ స్టోరీ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది.

తద్వారా ప్రేక్షకులందరిని ఈ సినిమా ఎలా మెప్పిస్తుంది. తన నటనను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనేది తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన క, కే ర్యాంప్ సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అదే బాటలో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే చూడాలని ఆరాటపడుతున్నాడు.

కానీ ఇది ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక వీళ్లిద్దరితోపాటు సందీప్ కిషన్ కూడా తొందరలోనే తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సందీప్ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఆయనకు హిట్ ఇచ్చే దర్శకుడైతే దొరకడం లేదు. రాబోయే రోజుల్లో ఒక భారీ సక్సెస్ ని సాధించి మరోసారి తన స్టామినా ఏంటో చూపించి తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…

ఇక ఏది ఏమైనా కూడా కుర్ర హీరోలందరు దర్శకత్వ విభాగంలో రాణించాలనే ప్రయత్నం చేయడం మంచిదే అయినప్పటికి వాళ్ళ ఇమేజ్ దెబ్బ తినకుండా గొప్ప సినిమాలను చేయగలిగితే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper