Homeఎంటర్టైన్మెంట్కమల్ హాసన్ సినిమాలో యంగ్ బ్యూటీ !

కమల్ హాసన్ సినిమాలో యంగ్ బ్యూటీ !

గ్రేట్ డైరెక్టర్ శంకర్, గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో రానున్న ‘భారతీయుడు 2’కి మొదటి నుండి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య సెట్లో పెద్ద క్రేన్ పడి శంకర్ అసిస్టెంట్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు కూడా చనిపోయిన తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమా నుండి ఓ యువనటి తప్పుకుందట. ఆమెది భారతీయుడు సీక్వెల్ లో కీలక […]


గ్రేట్ డైరెక్టర్ శంకర్, గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో రానున్న ‘భారతీయుడు 2’కి మొదటి నుండి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య సెట్లో పెద్ద క్రేన్ పడి శంకర్ అసిస్టెంట్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు కూడా చనిపోయిన తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమా నుండి ఓ యువనటి తప్పుకుందట. ఆమెది భారతీయుడు సీక్వెల్ లో కీలక పాత్ర అని, అందుకే ఆమె పాత్రలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హీరోయిన్ శ్రుతి శర్మను తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం జూలైలో జరగనున్న షెడ్యూల్ లో శ్రుతి శర్మ కూడా షూట్ లో పాల్గొంటుందట. ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు కేటాయించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ కూడా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్ కూడా భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషిస్తున్నాడు.

యువ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2021లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ సినిమాని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ సినిమానైనా అటు కమల్ కి ఇటు శంకర్ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper