Homeఎంటర్టైన్మెంట్కెరీర్ ను నాశనం చేసుకుంటున్న టాలెంటెడ్ బ్యూటీ !

కెరీర్ ను నాశనం చేసుకుంటున్న టాలెంటెడ్ బ్యూటీ !

‘శ్రీ రాపాక’ అలియాస్ స్వీటీ.. అదే ఆర్జీవీ ‘నగ్నం’ సినిమా హీరోయిన్. హాట్ బ్యూటీగా పరిచయం అవ్వకముందు ‘శ్రీ రాపాక’, గతంలో పలు చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది. పైగా నిఫ్ట్‌(నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో ఆమె కాలేజీ టాపర్ కూడా. మంచి టాలెంట్ ఉన్న ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి. అచ్చ తెలుగు యువతి. అన్నిటికి మించి ఆమె స్టార్ హీరోల అందరితో పని చేసింది. తక్కువ వయసులోనే ఫ్యాషన్ డిజైనర్ గా […]

Shree Rapaka
‘శ్రీ రాపాక’ అలియాస్ స్వీటీ.. అదే ఆర్జీవీ ‘నగ్నం’ సినిమా హీరోయిన్. హాట్ బ్యూటీగా పరిచయం అవ్వకముందు ‘శ్రీ రాపాక’, గతంలో పలు చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది. పైగా నిఫ్ట్‌(నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో ఆమె కాలేజీ టాపర్ కూడా. మంచి టాలెంట్ ఉన్న ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి. అచ్చ తెలుగు యువతి. అన్నిటికి మించి ఆమె స్టార్ హీరోల అందరితో పని చేసింది. తక్కువ వయసులోనే ఫ్యాషన్ డిజైనర్ గా ఫుల్ సక్సెస్ అయింది. కానీ ఆమె బోల్డ్ నటిగా మారి మొత్తానికి ట్రాక్ తప్పింది.

Also Read:  ‘లేడీ సూపర్ స్టార్’ పెళ్లికి డేట్ ఫిక్స్ !

లైఫ్ లో మళ్ళీ ప్లే బ్యాక్ చేయలేని మిస్టేక్ చేసింది. టాప్ ఫ్యాషన్ డిజైనర్ అయిన ఆమెకు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. మరోపక్క ఐటమ్ పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. పోనీ, అవి పెద్ద సినిమాలా అంటే.. అది కాదు. ఊరు పేరు లేని సినిమాలు. వాటిల్లో కూడా చీప్ క్యారెక్టర్స్. హీరోయిన్లకు అందమైన డ్రెస్ లను డిజైన్ చేసిన శ్రీ రాపాక, ఇప్పుడు అసహ్యమైన డ్రెస్ లతో చిన్న చిన్న పాత్రల కోసం ఆఫీసుల చుటూ సిగ్గు విడిచి తిరగాల్సి వస్తోంది.

Also Read: బాలీవుడ్ హీరోయిన్స్ కి అతనే కావాలట !

అసలు వర్మ ఆమెని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే, ఆమె గురించి అతను ఇచ్చిన పరిచయ పదాలే దారుణం అనుకుంటే.. ఆ సమయంలో ఆమె ఇచ్చిన పోజులు కూడా బాగా శృతి మించాయి. దాంతో ఇప్పుడు ఆమెకు వస్తోన్న సినిమాలు కూడా అంతే దారుణమైనవి వస్తున్నాయి. ఇవి కూడా మరో నాలుగైదు సినిమాలు వస్తాయి. ఆ తరువాత అవి కూడా ఆగిపోతాయి. అప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి ? అప్పటికే సమాజంలో ఆమెకంటూ ఒక బోల్డ్ ఇమేజ్ వచ్చి ఉంటుంది. ఇక అప్పుడు ఆమె అటు ఫ్యాషన్ డిజైనర్ గానూ, ఇటు నటిగానూ కొనసాలేదు. మరి ఇప్పటికైనా ‘శ్రీ రాపాక’ తన కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper