Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాశులపై పూర్వ పాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు ఈరోజు అన్ని శుభాలే జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి శుభవార్తను అందుతాయి. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించకపోవడం మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ప్రతి పనిలో ఉత్సాహంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఇవి వ్యాపారులకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. లాభదాయకమైన వార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): గతంలో చేపట్టిన పనులు పూర్తికావడంతో సంతృప్తిగా ఉంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం. పిల్లలతో సరదాగా ఉంటారు. ఇతర ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఎవరికీ డబ్బు ఇవ్వకపోవడమే మంచిది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంటికి అతిధులు రావడంతో సందడిగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కష్టంగా సాగుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రియమైన వారి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆర్థిక ప్రణాళికను లాబిస్తాయి. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. పిల్లలతో సరదాగా ఉంటారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. అనవసరపు వివాదాలకు తలదొచ్చకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే. కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నిరాశ కలిగి అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొంతవరకు నష్టం ఉంటుంది. ఉద్యోగులకు సానుకూల వాతావరణ ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త స్నేహాలను ఏర్పరచుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చురుగ్గా ఉండటంతో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వినాల్సి వస్తుంది. తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులకు పదోన్నతి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాజు వారు కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో మొదలు పెట్టిన పనులు ఎప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసరమైన చిక్కుల్లో తలదూర్చకూడదు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు వారికి ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. అయితే పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . . ఈ రాశి వ్యాపారులకు కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉంటుంది. దీంతో ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేస్తారు. ప్రాణాలు చేయడం వల్ల అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభాలే జరుగుతాయి. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు పెరుగుతుంది. కార్యాలయాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది.