Anand Mahindra : నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు, ఒత్తిళ్లు ఉంటాయి. మారుతున్న కాలంతో పాటు ప్రతీదీ మారిపోతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఒక కీలకమైన ట్వీట్ చేశారు. ఆయన తన 44 ఏళ్ల కెరీర్‌లో నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాఠాన్ని పంచుకున్నారు. కఠిన సమయాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు… ఏవీ శాశ్వతం కావని ఆయన చెప్పడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఆనంద్ మహీంద్రా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గా, గత నాలుగున్నర దశాబ్దాలుగా భారత వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన నాయకత్వంలో మహీంద్రా గ్రూప్ ఆటోమొబైల్స్, వ్యవసాయ పరికరాలు , ఆర్థిక సేవలు, ఐటీ వంటి అనేక రంగాలలో విస్తరించింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన నిస్సందేహంగా అనేక క్లిష్ట పరిస్థితులను, ఆర్థిక సవాళ్లను, మార్కెట్ ఒడిదుడుకులను చూసి ఉంటారు. టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో, వ్యాపార ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే స్థిరమైన ప్రణాళిక ఎంత ముఖ్యమో ఆయనకు బాగా తెలుసు. అలాంటి అనుభవాల నుంచి పుట్టినదే ఆయన ఇటీవల పంచుకున్న ఈ జీవిత పాఠం.
Also Read: రాజ్ భవన్ లోకి రాజావారు.. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు!
ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశం చాలా సరళంగా ఉంది కానీ లోతైన అర్థం దాగి ఉంది. ఆయన ఇలా అన్నారు.. “నా 44 ఏళ్ల కెరీర్‌లో నేను నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదీ శాశ్వతం కాదు. కఠిన క్షణాలు, ఒత్తిళ్లు, ఎదురుదెబ్బలు… ఇవన్నీ గడిచిపోతాయి. మీరు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, దాని నుండి బయటపడలేమేమో అనిపించొచ్చు. కానీ… ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. మీరు చేయగలిగినంత బెస్ట్ గా చూస్తూనే ఉండాలి. అలాగే ముందుకు సాగండి. పరిస్థితులు మారతాయని నమ్మండి” అంటూ రాసుకొచ్చారు.
ఈ మాటలు కేవలం వ్యాపార ప్రపంచానికే కాదు, జీవితంలో ఎదురయ్యే ఏ కష్టానికైనా వర్తిస్తాయి. వైఫల్యాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా, ఆశావాదంతో ముందుకు సాగాలని ఆయన నొక్కి చెప్పారు. మహీంద్రా వంటి అనుభవం కలిగిన వ్యాపారవేత్త నుండి వచ్చిన ఈ మాటలు ఒత్తిళ్లకు గురవుతున్న యువతకు, వ్యాపారులకు ఒక గొప్ప భరోసాను ఇస్తాయి.
Also Read: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?! జనసైనికుల ఫుల్ హ్యాపీ
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఆయన ఇచ్చిన సలహాను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఒక యూజర్, మనం చేసే పనిలో నిలకడ, నమ్మకం చాలా ముఖ్యమని ఆనంద్ మహీద్ర చెప్పిన మాటలకు సపోర్టుగా నిలిచారు. చాలా మంది ఆయన 44 ఏళ్ల కెరీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆనంద్ మహీంద్రా కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన లేటెస్ట్ మెసేజ్ కష్టాలు తాత్కాలికం అని, వాటిని అధిగమించడానికి ఆశావాదం అవసరమని మరోసారి గుర్తుచేస్తుంది.
ఆనంద్ మహీంద్రా ఆయన కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, దూరదృష్టి గల నాయకుడిగా పాపులర్. ఆనంద్ మహీంద్రా 1955 మే 1న ముంబైలో జన్మించారు. ఆయన మహీంద్రా గ్రూప్ సహ-వ్యవస్థాపకుడు, జగదీష్ చంద్ర మహీంద్రా మనవడు. హార్వర్డ్ యూనివర్సిటీ నుండి ఫిల్మ్ అండ్ ఫోటోగ్రఫీలో డిగ్రీ, ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి MBA పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత 1981లో ఇండియాకు తిరిగి వచ్చి, మహీంద్రా యుజిన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ లో ఫైనాన్స్ డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1989లో MUSCO ప్రెసిడెంట్‌గా, ఆపై 1991లో మహీంద్రా & మహీంద్రా గ్రూప్‌కు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ పొందారు.
Also Read: 500 రూపాయల నోటు రద్దు కాబోతోందా? మళ్లీ ఏం జరుగుతోంది?
ఆనంద్ మహీంద్రా నాయకత్వంలో మహీంద్రా గ్రూప్ ఒక చిన్న ఆటోమొబైల్, ట్రాక్టర్ల తయారీ సంస్థ నుండి మల్టినేషనల్ కంపెనీగా రూపాంతరం చెందింది. ఆయన నాయకత్వంలో ఈ గ్రూప్ కేవలం వాహనాల తయారీకే పరిమితం కాకుండా అనేక కొత్త రంగాల్లోకి ప్రవేశించింది. ఆటోమోటివ్, ఫామ్ ఎక్విప్‌మెంట్, ఆర్థిక సేవలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్, ఎరోస్ట్రక్చర్స్, డిఫెన్స్ , ఆఫ్టర్‌మార్కెట్స్ వంటి వాటిలో ఆయనకు బిజినెస్ లు ఉన్నాయి.
ఫోర్బ్స్ ప్రకారం బిలియనీర్ల జాబితాలో నిలిచినప్పటికీ, ఆనంద్ మహీంద్రా తన సాధారణ జీవితాన్ని గడుపుతూ నిత్యం ప్రజలతో కనెక్ట్ అవుతుంటారు. ఆయన ఎన్నో సార్లు ప్రపంచంలోని 50 టాప్ లీడర్లలో ఒకరిగా, ఆసియాలోని అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. పద్మభూషణ్ వంటి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు.