Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ డిఫరెంట్ పద్దతి కారణంగా భవిష్యత్తులో ‘బిగ్ బాస్ 10’ చాలా తీవ్రమైన నెగిటివిటీ ని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్ లో దమ్ము శ్రీజ ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ తో కాకుండా, టాస్క్ కారణంగా ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో కూడా అలాంటి ఎలిమినేషన్స్ చాలానే ప్లాన్ చేశారట మేకర్స్. ఈరోజు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ లో జరిగే టాస్క్ కూడా అలాంటిదే అట. కంటెస్టెంట్స్ ని టాస్కుల్లో పెర్ఫార్మన్స్ ఆధారంగా హై రిస్క్ జోన్ లోకి పంపుతారట. హై రిస్క్ జోన్ అంటే, ఎలిమినేషన్ కి దగ్గర్లో ఉన్నట్టు అన్నమాట. ప్రస్తుతానికి ఈ జోన్ లో ఆటో రామ్ ప్రసాద్, చరణ్ లు ఉన్నారు.
వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టాస్కుల ద్వారా ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ , మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇలాంటోళ్ళు టాస్కుల ద్వారా ఎలిమినేట్ అవ్వడం అన్యాయం. తోపులు అనిపించుకున్న కంటెస్టెంట్స్ కూడా, టాస్కులు ఒక్కోసారి బాగా ఆడడం లో విఫలం అవుతుంటారు. అంత మాత్రానా వాళ్ళని ఎలిమినేట్ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు అనేది నెటిజెన్స్ అభిప్రాయం. ఒక్క శ్రీజ ని అలా ఎలిమినేట్ చేసినందుకే , గత సీజన్ లో ఆమె కోసం నెటిజెన్స్ సోషల్ మీడియా లో పెద్ద యుద్ధమే చేశారు. అలాంటిది ఈ సీజన్ లో అలాంటి ఎలిమినేషన్స్ మొదటి వారం నుండే ఉండబోతున్నాయి అనే సంకేతాలు ఇస్తే , ఈ షో పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ‘బిగ్ బాస్ 10’ టీం కొత్తగా ప్రయత్నం చెయ్యాలని , ఇలాంటివి చేసి మొత్తానికే మోసం తెచ్చుకునే ప్రమాదం ఉందని అంటున్నారు నెటిజెన్స్.
ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు , ఆడియన్స్ ఓటింగ్ కి ప్రాధాన్యత ఏముంటుంది చెప్పండి అనేది నెటిజెన్స్ ప్రశ్న. ఇప్పటికే ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ ఎంపిక ఓటింగ్ కి అనుగుణంగా జరగలేదని, కేవలం వాళ్లకు ఇష్టమొచ్చిన వాళ్లనే తీసుకున్నారనే భావన నెటిజెన్స్ లో అలా ఉండిపోయింది. ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ లో కూడా ఇదే చేస్తే ఆడియన్స్ క్షమించరు, భవిష్యత్తులో ఈ షో ని చూడడం ఆపేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు, షాకింగ్ సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి అనేది.