Homeబిజినెస్iPhone 18 Pro కెమెరాలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. మాన్యువల్ ఫోకస్ సహా కొత్త ఫీచర్లు ఇవీ

iPhone 18 Pro కెమెరాలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. మాన్యువల్ ఫోకస్ సహా కొత్త ఫీచర్లు ఇవీ

iPhone 18 Pro : టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ iPhone 18 Proకు సంబంధించి ఆసక్తికరమైన లీక్ వెలుగులోకి వచ్చింది. కెమెరా విభాగంలో యాపిల్ ఇప్పటివరకు అందించని కొన్ని ప్రొఫెషనల్ స్థాయి ఫీచర్లను తీసుకురానున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాన్యువల్ ఫోకస్, ఫోకస్ పీకింగ్, ఎక్స్‌పోజర్ స్కోప్స్, హైలైట్ వార్నింగ్స్ వంటి అధునాతన కెమెరా కంట్రోల్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వివరాలు తాజాగా విడుదలైన ఐఓఎస్ 27 […]

iPhone 18 Pro : టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ iPhone 18 Proకు సంబంధించి ఆసక్తికరమైన లీక్ వెలుగులోకి వచ్చింది. కెమెరా విభాగంలో యాపిల్ ఇప్పటివరకు అందించని కొన్ని ప్రొఫెషనల్ స్థాయి ఫీచర్లను తీసుకురానున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాన్యువల్ ఫోకస్, ఫోకస్ పీకింగ్, ఎక్స్‌పోజర్ స్కోప్స్, హైలైట్ వార్నింగ్స్ వంటి అధునాతన కెమెరా కంట్రోల్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ వివరాలు తాజాగా విడుదలైన ఐఓఎస్ 27 డెవలపర్ బీటా 8 కోడ్‌లో కనిపించినట్లు మ్యాక్ రూమర్స్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు సాధారణ యూజర్లకు అందుబాటులో లేవు. డెవలపర్లకు మాత్రమే కనిపిస్తున్న ఈ కెమెరా ఆప్షన్లు భవిష్యత్తులో ఐఓఎస్ 27లో భాగంగా విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిలో కొన్ని ఫీచర్లు ప్రత్యేకంగా ఐఫోన్ 18 ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితం కావచ్చని తెలుస్తోంది.

కెమెరాలో ఎక్స్‌పోజర్ స్కోప్స్

కొత్త ఫీచర్లలో ఎక్స్ పోసర్స్ స్కోప్స్ ఒకటి. దీని ద్వారా కెమెరా ప్రివ్యూలో హిస్టోగ్రామ్ లేదా వేవ్‌ఫార్మ్ ఓవర్‌లే కనిపిస్తుంది. ఫొటో లేదా వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్‌లోని మిడ్‌టోన్స్, షాడోస్, హైలైట్స్ వంటి అంశాలను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండు రకాల స్కోప్స్‌కు మూడు ప్రీసెట్లు కూడా ఉండనున్నట్లు సమాచారం.

ఫోకస్ పీకింగ్‌తో కచ్చితమైన ఫోకస్

ప్రొఫెషనల్ కెమెరాల్లో ఇప్పటికే కనిపించే ఫోకస్ పీకింగ్ ఫీచర్ కూడా ఐఫోన్ కెమెరాకు వచ్చే అవకాశం ఉంది. ఇది కెమెరా ప్రివ్యూలో ప్రస్తుతం ఏ ప్రాంతం ఫోకస్‌లో ఉందో హైలైట్ చేస్తుంది. మాన్యువల్ ఫోకస్‌తో ఫొటోలు లేదా వీడియోలు తీసే సమయంలో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఓవర్ ఎక్స్‌పోజర్‌కు హైలైట్ వార్నింగ్స్

ఫ్రేమ్‌లో ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన ప్రాంతాలను గుర్తించేందుకు హైలెట్స్ వార్నింగ్ కూడా రానున్నట్లు లీక్ సూచిస్తోంది. స్ట్రైప్స్, చెకర్‌బోర్డ్ లేదా సాలిడ్ కలర్ వంటి ప్యాటర్న్లతో ఓవర్ ఎక్స్‌పోజ్ అయిన భాగాలను కెమెరా ప్రివ్యూలో చూపించే అవకాశం ఉంది.

మాన్యువల్ ఫోకస్ ఇక డిఫాల్ట్ కెమెరాలోనే?

ప్రస్తుతం ఐఫోన్‌లో మాన్యువల్ ఫోకస్ వంటి అధునాతన కంట్రోల్స్ కోసం థర్డ్ పార్టీ యాప్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. ఉదాహరణకు ఫైనల్ కట్ కెమెరా వంటి యాప్స్ ద్వారా ప్రొఫెషనల్ కెమెరా కంట్రోల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే యాపిల్ తన డిఫాల్ట్ కెమెరా యాప్‌లోనే మ్యానువల్ ఫోకస్ ను అందించే అవకాశం ఉందని తాజా లీక్ చెబుతోంది.

అయితే ఈ ఫీచర్ అన్ని ఐఫోన్ మోడళ్లకు అందుబాటులో ఉంటుందా లేదా iPhone 18 Pro సిరీస్‌కు మాత్రమే పరిమితం చేస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుత ఐఫోన్ మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రాదని లీక్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

అపెర్చర్ ఆధారిత ఇమేజ్ కరెక్షన్

ఐఓఎస్ 27 డెవలపర్ బీటాలో కనిపించిన మరో ఆసక్తికరమైన ఫీచర్ ఎపర్చరు ఆధారిత చిత్ర సవరణ. లెన్స్‌లో ఎంపిక అపెర్చర్ ఆధారంగా ఇమేజ్‌లో అవసరమైన లెన్స్ కరెక్షన్స్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసే విధంగా ఇది పనిచేసే అవకాశం ఉంది.

ఈ ఫీచర్ ప్రత్యేకంగా iPhone 18 ప్రోకు కీలకం కావచ్చు. ఎందుకంటే కొత్త ప్రో మోడళ్లలో వేరియబుల్-ఎపర్చరు కెమెరా సిస్టమ్ వచ్చే అవకాశం ఇప్పటికే అనేక నివేదికలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ మోడల్‌లో కెమెరా అపెర్చర్ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. దీనితో అపెర్చర్ ఆధారిత ఇమేజ్ కరెక్షన్ అవసరం పరిమితంగా ఉంటుంది.

టైమర్‌తో వరుస ఫొటోలు కూడా..

Self-Timed Shotsలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కౌంట్‌డౌన్ టైమర్‌ని ఉపయోగించి ఒక ఫోటో తీసిన తర్వాత మళ్లీ టైమర్‌ను సెట్ చేయాల్సిన అవసరం లేకుండా వరుసగా పలు టైమ్‌డ్ ఫొటోలు తీసుకునే రిపీట్ ఫీచర్‌ను యాపిల్ తీసుకురావాల్సిన సమాచారం.

మొత్తంగా చూస్తే, iOS 27 కోడ్‌లో కనిపించిన ఈ ఫీచర్లు యాపిల్ తన డిఫాల్ట్ కెమెరా యాప్‌ను మరింత ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు సూచిస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఫీచర్లు నిజంగా iPhone 18 Proలో అందుబాటులోకి వస్తాయి, ఏవి ఇతర మోడళ్లకు వస్తాయి, అలాగే పబ్లిక్ రిలీజ్ ఎప్పుడు జరుగుతుందనే విషయాలపై యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ లీక్ ఆధారిత సమాచారంగానే చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper