Sekhar Master
Sekhar Master: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఒక స్థలం విషయంలో దారుణంగా మోసపోయాడట. తెలిసిన వాళ్ళు చెప్పారని స్థలాన్ని కొన్నాడట. చివరకు అప్పులు మిగలడంతో పాటు స్థలం కూడా లేకుండా పోయిందట. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు. టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్ శేఖర్ మాస్టర్ అనడంలో సందేహం లేదు. బడా చిత్రాలకు పనిచేస్తూ… కోట్లు సంపాదిస్తున్నాడు. మరోవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా కొంత ఆర్జిస్తున్నారు.
శేఖర్ మాస్టర్ తన సంపాదన పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఆయన మోసపోయారట. స్నేహితులు చెప్పారని విజయవాడ-గుంటూరు హైవే ప్రాంతంలో ఆయన ఒక స్థలం కొన్నారట. అప్పు చేసి మరీ స్థలం కొనుగోలు చేశారట. శేఖర్ మాస్టర్ కొన్నాళ్ళకు ఆ స్థలం అమ్మేయాలని అనుకున్నారట. ఇదే విషయం స్నేహితులకు చెబితే… కోవిడ్ తర్వాత రేట్లు తగ్గాయి. కొన్న ధరకు కూడా అమ్మలేము అన్నారట.
అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువ కావడంతో వచ్చిన ధరకు ఆ స్థలాన్ని అమ్మేయాలని శేఖర్ మాస్టర్ అనుకున్నారట. ఇదే విషయం స్నేహితులకు చెప్పగా… వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయట. మోసపోయామని శేఖర్ మాస్టర్ కి అప్పుడు అర్థం అయ్యిందట.
అసలు ఎలాంటి పరిచయం లేని వ్యక్తి మాత్రం ఓ స్థలం విషయంలో చాలా ఫేవర్ చేశాడట. ఆయన చెప్పిన స్థలం కొని అమ్మగా మంచి లాభాలు వచ్చాయట. అత్త తరపు వారు ఒక వ్యక్తిని పరిచయం చేయగా, ఆయన సలహా మేరకు స్థలం కొన్నాను. దాని వలన ప్రయోజనం పొందానని శేఖర్ మాస్టర్ అన్నారు. అయిన వాళ్ళను నమ్మితే మాత్రం మోసం చేశారని వాపోయాడు.
Web Title: Sekhar master who lost crores in real estate
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com