Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi And Kiara Advani: హీరోయిన్ కియారా అద్వానీ పై సాయి పల్లవి కౌంటర్...

Sai Pallavi And Kiara Advani: హీరోయిన్ కియారా అద్వానీ పై సాయి పల్లవి కౌంటర్ అటాక్.. ముద్దు సన్నివేశాలపై ఘాటు కామెంట్స్..

Sai Pallavi And Kiara Advani: నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో నటన పరంగా , డ్యాన్స్ పరంగా ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయగల సత్తా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమెకు యూత్ ఆడియన్స్ లో మాత్రమే కాదు , ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే అందరి హీరోయిన్స్ లాగా ఈమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టం చూపించదు. చిన్నపాటి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి […]

Sai Pallavi And Kiara Advani: నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో నటన పరంగా , డ్యాన్స్ పరంగా ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయగల సత్తా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమెకు యూత్ ఆడియన్స్ లో మాత్రమే కాదు , ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే అందరి హీరోయిన్స్ లాగా ఈమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టం చూపించదు. చిన్నపాటి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి రెడీ కానీ , హద్దులు దాటినా రొమాన్స్ కి మాత్రం ఈమె అసలు ఒప్పుకోదు. ఆ చిన్నపాటి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి కూడా, కథ , కంటెంట్ డిమాండ్ చేస్తేనే చేస్తుంది , లేదంటే నో చెప్తుంది. రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇలాంటి సన్నివేశాలపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ముందుగా రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘డైరెక్టర్స్ మీతో ముద్దు సన్నివేశాలు తీయడానికి ఎందుకు ఆసక్తి చూపించరు?, మిమ్మల్ని ఒక్కసారి కూడా అలాంటి సన్నివేశాల్లో నటించమని వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదట, నిజమేనా?’ అని అడగ్గా, అందుకు సాయి పల్లవి సమాధానం చెప్తూ ‘అవును.. నిజమే .. ఎందుకంటే నేను అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడను అనే విషయం వాళ్లకు తెలుసు కాబట్టి’ అని సమాధానం ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్ మాట్లాడుతూ ‘ఎందుకు , మీరు ఇండస్ట్రీ లోకి వచ్చే ముందే ఇలాంటి పాలసీ పెట్టుకున్నారా?’ అని అడగ్గా, అందుకు సాయి పల్లవి సమాధానం చెప్తూ ‘నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు , అతని కోసం నేను అలాంటి సన్నివేశాల్లో నటించను. అది నటన అయినా సరే నాకు ఇష్టం ఉండదు. ప్రతీ మనిషి ఇల్లు , కారు , ఒక ప్రశాంతవంతమైన జీవితాన్ని కోరుకుంటారు , నాకు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి , ముద్దు సన్నివేశాల్లో నటించి వాటిని సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఉన్న వాటిట్లోనే నాకు సంతృప్తి ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

మరి సాయి పల్లవి కి , కియారా అద్వానీ కి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు , రీసెంట్ గానే కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ‘టాక్సిక్’ మూవీ మొదటి సాంగ్ విడుదలైంది. ఇందులో ఆమె హీరో యాష్ తో హద్దులు దాటి మరీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఆమెకు ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో రీసెంట్ గానే పెళ్లి అయ్యింది. ఒక పాప కూడా పుట్టింది. అయినప్పటికీ ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. కానీ సాయి పల్లవి మాత్రం కాబోయే భర్త గురించి అలోచించి ఇంత మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు పరోక్షంగా కియారా అద్వానీ కి కౌంటర్ ఇచ్చినట్టుగానే ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper