spot_img
Homeఎంటర్టైన్మెంట్RRR Pre Release Business: వామ్మో.. ఏందీ ప్ర‌భంజ‌నం.. బాహుబ‌లి-2 ను మించి ఆర్ఆర్ఆర్...

RRR Pre Release Business: వామ్మో.. ఏందీ ప్ర‌భంజ‌నం.. బాహుబ‌లి-2 ను మించి ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్‌..

RRR Pre Release Business: హీరోల సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్‌లు వేరు… రాజ‌మౌళి మూవీల ప్రీ రిలీజ్ బిజినెస్‌లు వేరు. ఈ విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్ర‌స్తుతం ఇండియా మొత్తం ఆర్ఆర్ఆర్ మేనియానే క‌నిపిస్తోంది. ఒక్క ఇండియా ఏంటి.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ చూస్తుంటే.. బాక్సులు బ‌ద్ద‌లైపోవ‌డం ఖాయం అని అంటున్నారు.

RRR Pre Release Business
RRR Pre Release Business

ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే.. ఈ మూవీ ఏకంగా రాజ‌మౌళి అంత‌కు ముందు తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 కంటూ రూ.80కోట్లు ఎక్కువ‌గా బిజినెస్ చేసింది. రిలీజ్‌కు ఇంకా మూడు రోజుల స‌మ‌యం ఉండ‌గానే.. సంచ‌ల‌న రికార్డుల‌ను న‌మోదు చేస్తుంది. బుకింగ్స్ ద‌గ్గ‌రి నుంచి మొద‌లు కొని.. మూవీ బిజినెస్ వ‌ర‌కు అంతా ఓ రేంజ్‌లోనే సాగుతోంది.

Also Read: Aravind Swamy In Ram Charan New Movie: చరణ్ తో మళ్ళీ కొట్టించుకోబోతున్న హ్యాండ్సమ్ హీరో

పైగా ఈ మూవీలో ఇద్ద‌రు స్టార్ హీరోలు అయిన రామ్‌చ‌ర‌ణ్‌, తార‌క్‌లు కూడా న‌టిస్తుండ‌టం ఈ మూవీకి మ‌రింత హైప్ తీసుకు వ‌చ్చింద‌నే చెప్పుకోవాలి. దాంతో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి హైప్ వ‌చ్చేసింది. పైగా ప్ర‌మోష‌న్స్ కూడా ఓ రేంజ్‌లో చేస్తుండ‌టంతో.. ఇండియా వ్యాప్తంగా ఈ మూవీకి భారీ మార్కెట్ ఏర్ప‌డింది.

ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.70 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు సీడెడ్ లో సీడెడ్ రూ.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22 కోట్లు, ఈస్ట్ లో రూ.14 కోట్లు, వెస్ట్ లో రూ.12 కోట్లు, గుంటూరులో రూ.15కోట్ల బిజినెస్ చేసింది. ఇక అటు కృష్ణాలో రూ.13 కోట్లు, నెల్లూరులో రూ.8కోట్లు వ‌ర‌కు బిజినెస్ చేసిది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ.191 కోట్ల బిజినెస్ చేసింది.

RRR Pre Release Business
RRR Pre Release Business

అటు రెస్టాఫ్ ఇండియాలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.41 కోట్లు, తమిళనాడులో రూ.35 కోట్లు, కేరళలో రూ.9కోట్లు, హిందీలో రూ.92 కోట్లు, ఓవర్సీస్ లో ఏకంగా రూ.75 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.451 కోట్ల బిజినెస్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే దీనికి బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.455 కోట్లు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని భాష‌ల్లో కూడా రికార్డు వ‌సూళ్ల‌ను సాధిస్తేనే ఈ మూవీ హిట్ టాక్ లోకి వ‌స్తుంది.

Also Read: SS Rajamouli: రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం మీకు తెలుసా..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper