spot_img
Homeఎంటర్టైన్మెంట్Vishwambhara: విశ్వంభర సినిమాలో ఒకప్పటి చిరు సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా..?

Vishwambhara: విశ్వంభర సినిమాలో ఒకప్పటి చిరు సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా..?

Vishwambhara: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకొని నటించి మెప్పించడమే కాకుండా మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించిన ఘనత సాధించుకున్న హీరో చిరంజీవి.కమర్షియల్ సినిమాలు తీయడంలో చిరంజీవిని మించిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఆయన ఒకప్పుడు తీసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించేవి. ఇక ప్రస్తుతం ఆయన వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే ఆయన రాత్రి పగలు విపరీతంగా కష్టపడుతూ మరో సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతుంది. కాబట్టి ఇందులో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ని చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇక నార్మల్ కమర్షియల్ సినిమా అయితే రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్ తో నడుస్తూ ఉంటుంది. కాబట్టి అవి చేయడం చాలా ఈజీ కానీ సోషయో ఫాంటసీ మూవీలో గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేస్తూనే చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది.

ఇక దాంతో షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి ఒరిజినల్ షాట్స్ అయిన, గ్రాఫికల్ షాట్స్ అయిన అన్నింటిని సమపాళ్లల్లో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే గత సంవత్సరం ఆయన చేసిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. చిరంజీవి త్రిష కాంబినేషన్ లో స్టాలిన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ చిరంజీవి రేంజ్ లో అయితే సక్సెస్ అయితే సాధించలేదు. ఇక వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని మెగా అభిమానులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే చిరంజీవి, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేసిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమాలోని ‘ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా’ అనే సాంగ్ లోని ఒక ట్రాక్ ను విశ్వంభర సినిమా కోసం రీమిక్స్ చేసి వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సాంగ్ లో చిరంజీవి శ్రీదేవి ల మధ్య ఉండే కెమిస్ట్రీ ని బాగా వర్కౌట్ అయింది. మరి చిరంజీవి త్రిష మళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా లేదా అనేది చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper