Homeఎంటర్టైన్మెంట్Tollywood directors conflict: ఆ దర్శకుల మధ్య గొడవలు జరగడానికి కారణం ఇదే..

Tollywood directors conflict: ఆ దర్శకుల మధ్య గొడవలు జరగడానికి కారణం ఇదే..

Tollywood directors conflict: తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచే విధంగా మన దర్శక నిర్మాతలు సినిమాలను చేస్తున్నారు. హీరోలు సైతం డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. దర్శకుల మధ్య పోటీ అనేది తీవ్రతరమవుతుంది. ఒక డైరెక్టర్ ఒక హీరోని సెలెక్ట్ చేసుకుని కథ చెప్పిన తర్వాత మరో దర్శకుడు వచ్చి అదే హీరోకి కథను చెప్పి […]

Tollywood directors conflict: తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచే విధంగా మన దర్శక నిర్మాతలు సినిమాలను చేస్తున్నారు. హీరోలు సైతం డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. దర్శకుల మధ్య పోటీ అనేది తీవ్రతరమవుతుంది. ఒక డైరెక్టర్ ఒక హీరోని సెలెక్ట్ చేసుకుని కథ చెప్పిన తర్వాత మరో దర్శకుడు వచ్చి అదే హీరోకి కథను చెప్పి ఒప్పించి ఇంతకు ముందు కమిటైన దర్శకుడు కంటే ముందే తన సినిమాను సెట్స్ మీదకి తీసుకుపోవడంతో కొంతమంది దర్శకుల మధ్య గొడవలైతే జరుగుతున్నాయి. అయితే హీరోకి మొదట ఏ సినిమా కథ బాగా నచ్చితే ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలనుకుంటాను. అందులో దర్శకుడు తప్పు ఏమీ ఉండదు. అలాంటప్పుడు దర్శకులు ఎందుకని మిగిలిన దర్శకులతో గొడవలు పెట్టుకుంటున్నారు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు…

గతంలో పూరి జగన్నాథ్ ఒక హీరోకి కథను చెప్పి తను అంతకుముందు కమిటైన సినిమాల కంటే ముందే ఆ హీరో మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లేవాడు. దీనివల్ల మిగతా దర్శకులందరు పూరి మీద కొంతవరకు కోపాన్ని వ్యక్తం చేసేవారు… అలా రెండు మూడు సార్లు వివి వినాయక్ సైతం పూరి జగన్నాథ్ మీద కోపానికైతే వచ్చాడట.

Also Read: అనిల్ రావిపూడి మరోసారి కామెడీనే నమ్ముకుంటున్నాడా..?

ఎందుకంటే తను ఒక హీరోతో సినిమా కమిట్ అయినప్పుడు పూరి మూడు నెలల్లో సినిమా చేసేస్తానని చెప్పి ఆ హీరోకి కథను వినిపించి వినాయక్ కి ఇచ్చిన డేట్స్ తీసుకుని సినిమాలనైతే కంప్లీట్ చేశారట… ఆ సినిమా హీరో ఎవరు అనే విషయం బయటికి చెప్పడం లేదు. కానీ మొత్తానికైతే ఇలా ఒకటి రెండు సందర్భాల్లో జరిగాయని చెబుతున్నారు. వివి వినాయక్, పూరి జగన్నాథ్ ఇద్దరు బయట చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. కానీ ప్రొఫెషనల్ పరంగా మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వినాయక్ అసలు ఊరుకునే పరిస్థితి లేదు.

అందువల్లే పూరితో ఒకటి రెండు సార్లు గొడవలు కూడా పెట్టుకున్నాడనే వార్తలైతే అప్పట్లో హల్చల్ అయ్యాయి… ఇక వాళ్ళ మధ్య ప్రొఫెషనల్ గా జరిగిన గొడవలు తప్ప పర్సనల్ గా ఎలాంటి ఇష్యూస్ లేవు… సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది అంటే మళ్ళీ అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper