Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi and Ram Charan: చిరంజీవి - రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరి డ్యాన్స్ బాగుంటుంది......

Chiranjeevi and Ram Charan: చిరంజీవి – రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరి డ్యాన్స్ బాగుంటుంది… ఎవరు గ్రేట్…

Chiranjeevi and Ram Charan: మూస ధోరణిలో వెళుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన డ్యాన్స్ తో కొత్తదనాన్ని తీసుకొచ్చిన హీరో చిరంజీవి కెరియర్ స్టార్టింగ్ లో బ్రేక్ డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించిన ఆయన తన నటనతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. అందువల్లే ఆయన మెగాస్టార్ గా మారాడు. ఇక ఈ ప్రస్తుతం ఆయన 70 సంవత్సరాల వయసులో ఉన్న కూడా ఎవ్వరికి తగ్గకుండా స్టెప్పులు వేస్తూ డాన్సులు చేస్తున్నాడు అంటే ఆయనకి […]

Chiranjeevi and Ram Charan: మూస ధోరణిలో వెళుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన డ్యాన్స్ తో కొత్తదనాన్ని తీసుకొచ్చిన హీరో చిరంజీవి కెరియర్ స్టార్టింగ్ లో బ్రేక్ డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించిన ఆయన తన నటనతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. అందువల్లే ఆయన మెగాస్టార్ గా మారాడు. ఇక ఈ ప్రస్తుతం ఆయన 70 సంవత్సరాల వయసులో ఉన్న కూడా ఎవ్వరికి తగ్గకుండా స్టెప్పులు వేస్తూ డాన్సులు చేస్తున్నాడు అంటే ఆయనకి సినిమాలన్న డాన్స్ అన్న ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక చిరంజీవి తనయుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం డాన్స్లు వేయడంలో దిట్ట…చిరంజీవి డ్యాన్సర్ కావడంతో చరణ్ కి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ క్లాస్ లు నేర్పించి మరి తనను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. కాబట్టి డాన్సులు వేయడంలో రామ్ చరణ్ ను మించిన వారు ఎవ్వరు లేరనేంతలా పేరు ప్రఖ్యాత లను సంపాదించుకున్నాడు. ఇక బయటి వాళ్లతో పోటీని వదిలి పెడితే ఇంట్లోనే తన నాన్న చిరంజీవిని తను పోటీగా భావించి ఆయనకంటే బెటర్ గా డ్యాన్స్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో డాన్స్ నేర్చుకున్నాడట. అందువల్లే తను చాలా పర్ఫెక్షన్ తో స్టెప్స్ వేస్తుంటాడు. అప్పుడు నేర్చుకున్న డ్యాన్స్ సినిమాలపరంగా డ్యాన్స్ పరంగా తనకు చాలా బాగా హెల్ప్ అవుతుందని రామ్ చరణ్ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం… చిరంజీవి అపుడు చేసిన డ్యాన్స్ కి రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్న డ్యాన్స్ కి చాలా తేడాలైతే ఉన్నాయి. అప్పట్లో చిరంజీవి చాలా గ్రేస్ తో వేసేవాడు. అలాగే ప్రతి మూమెంట్ ని చాలా ఈజ్ తో వేసేస్తాడు. అలాగే ప్రేక్షకుల మన్ననలను పొందడానికి డిఫరెంట్ స్టెప్స్ కూడా ట్రై చేశాడు…

ఇక రామ్ చరణ్ వేసే స్టెప్పుల్లో ఒక రిథమ్ ఉంటుంది. ఆయన పర్ఫెక్ట్ గా స్టెప్ కి ఒక ఫినిషింగ్ కూడా ఇవ్వగలుగుతాడు. అందువల్ల రామ్ చరణ్ ఇప్పుడున్న వాళ్ళలో ది బెస్ట్ డాన్సర్ అనే చెప్పాలి. చిరంజీవి, రామ్ చరణ్ లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అనేది చెప్పడం చాలా కష్టం… ఎందుకంటే చిరంజీవి గ్రేస్ చిరంజీవికి ఉంది. రామ్ చరణ్ కి సెపరేట్ స్టైల్ ఉంది.

Also Read: ఆ దర్శకుల మధ్య గొడవలు జరగడానికి కారణం ఇదే..

ఎవరి బడి లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వాళ్ళు డాన్సులు వేస్తున్నారు… నిజానికి ఇప్పుడంటే ప్రతి ఒక్కరు డ్యాన్సులు చేస్తున్నారు. కానీ చిరంజీవి అప్పట్లోనే అంత మంచి డాన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అప్పుడున్న హీరోలెవరు అసలు డ్యాన్స్ వేయడానికి కూడా ట్రై చేసే వాళ్ళు కాదు.

కానీ చిరంజీవి బ్రేక్ డ్యాన్స్ తో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. అప్పట్లోనే ఆయనకు డ్యాన్స్ చేయాలని ప్రేక్షకుడిని మెప్పించాలనే కసి ఉండేదంటే ఆయన ఎంతలా కష్టపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ తరానికి చిరంజీవి చేసిన డ్యాన్స్ చాప గొప్పది. అప్పటికి ఇప్పటికి చిరంజీవే బెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper