spot_img
Homeఎంటర్టైన్మెంట్EAGLE Trailer Review : ఈగిల్ టీజర్ రివ్యూ: ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు,...

EAGLE Trailer Review : ఈగిల్ టీజర్ రివ్యూ: ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు, నెగిటివ్ షేడ్స్ లో రవితేజ విధ్వంసం

EAGLE Trailer Review : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. 2023లో రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు విడుదలయ్యాయి. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడు. వాల్తేరు వీరయ్య విజయంలో రవితేజ పాత్ర కీలకమైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టింది. దసరా బరిలో టైగర్ నాగేశ్వరరావు దిగాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా మూవీగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా 2024 సంక్రాంతికి మరో చిత్రం సిద్ధం చేశాడు. ఈగిల్ గా రవితేజ అలరించనున్నాడు. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. చడీ చప్పుడు లేకుండా ఈగిల్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఖర్చు చేశారనిపిస్తుంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి.

ఫారిన్ మాఫియా, గన్స్, వైలెన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. రవితేజ మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడని అర్థం అవుతుంది. ‘ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు’ అనే డైలాగ్ రవితేజ క్యారెక్టర్ ఏమిటో క్లారిటీ ఇస్తుంది. రవితేజ లుక్ బాగుంది. ఆయన పాత్ర ఏంటనే సస్పెన్సు రేకెత్తిస్తుంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు.

నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, అజయ్ ఘోష్ కీలక రోల్స్ చేశారు. ఈగిల్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీ జీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. దావ్ జండ్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఈగిల్ సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. లేదు రేసులో మేము ఉన్నామని ఈగిల్ నిర్మాతలు జోరుగా ప్రొమోషన్స్ చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper