Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తీవ్ర వివాదంలో చిక్కుకుని దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. అయితే విజేతగా నిలిచిన అనంతరం ఆయన బిగ్ బాస్ బజ్ లో పలు విషయాలు పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో రతిక గురించి తన బ్రేకప్ కి సంబంధించి యాంకర్ కొన్ని ప్రశ్నలు అడగ్గా ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. అయితే పల్లవి ప్రశాంత్ మొదట్లో రతిక మాయలో పడి రైతు బిడ్డ కాస్త పులిహోర బిడ్డగా మారాడు. ఇక కొన్ని రోజులు కంటిన్యూ చేసి .. చివరకు ఎవడ్రా నువ్వు అంటూ వెన్నుపోటు పొడిచింది రతిక.
ఇక మల్లి హౌస్ లో కి తిరిగి వచ్చిన తర్వాత రతిక – ప్రశాంత్ లు అక్క తమ్ముళ్లు గా మారిపోయారు. నన్ను అక్క అని పిలవకు అంటూ రతిక చెప్పినా .. ప్రశాంత్ కంటిన్యూ చేసాడు. దీంతో ఆడియన్స్ కి వాళ్ళ బంధం గురించి క్లారిటీ లేదు. ఈ క్రమంలో యాంకర్ ‘ రతిక తో అంత గొడవ జరిగింది కదా బయటకు వెళ్లిన తరువాత ఆమెతో మాట్లాడతారా’ అని అడిగింది. దానికి ప్రశాంత్ ‘ అదంతా గేమ్ లో నే బయట ఎవరితో భేదాభిప్రాయాలు లేవు.
వాళ్ళు కాల్ చేస్తే .. నేను కాల్ చేస్తాను. వాళ్ళు మాట్లాడితే … నేను మాట్లాడతాను. నాకు అలాంటి పట్టింపులు ఏమి లేవు. నేను అందరితో మంచిగా ఉంటాను అని ప్రశాంత్ వివరించాడు. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పిన సంగతి తెలిసిందే. దీని గురించి వీకెండ్ లో హోస్ట్ నాగార్జున కూడా అడిగారు. ‘ నీ మరదలి పేరు చెప్పు ప్రశాంత్ అని నాగార్జున అడగ్గా .. ఆమెకు పెళ్లి అయిపోయింది అని చెప్పాడు.
కాగా బజ్ కూడా అదే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె నన్ను పొలం పనులు చేసుకుంటున్నానని రిజెక్ట్ చేసింది. కానీ నాకు భాధ లేదు .. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆమె పేరు చెప్పడం కరెక్ట్ కాదు అని అన్నాడు. ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. ఎవరైనా ఇప్పుడు ప్రపోజ్ చేస్తే నేను స్పందించను. మా నాన్న ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటాను. నన్ను ఎవరు కావాలనుకున్నా మా నాన్న సరే అంటే చేసుకుంటాను అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.