Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: విజయ్ దేవరకొండ గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయిన రష్మిక... అది చాలా...

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయిన రష్మిక… అది చాలా బాగుంటుంది అంటూ

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య ఏదో నడుస్తుందనే పుకారు చాలా కాలంగా ఉంది. అందుకు వారు అత్యంత సన్నిహితంగా ఉండటం కారణం అయ్యింది. తాజాగా విజయ్ దేవరకొండ గురించి రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఏ పని చేసినా అతని సహకారం ఉంటుందని, ఆయన సలహాలు పాటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో రష్మిక తనతో పని చేసిన స్టార్స్ ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు.

అమితాబ్ గారు వయసులో వ్యత్యాసం చూడరు. అందరినీ ఒకే విధంగా గౌరవిస్తారు. ఇక రన్బీర్ కపూర్ గురించి చెప్పాలంటే… జీవితంలో ఏదైనా చేయగలను అనే ధైర్యం ఆయన ఇచ్చారు, అని చెప్పుకొచ్చింది. ఇక విజయ్ దేవరకొండ గురించి ఫస్ట్ టైం ఆమె ఓపెన్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ… ”నేను ఏ పని చేసినా ఆయన సహకారం ఉంటుంది. నేను సలహా తీసుకుంటాను. ఆయన సూచనలు నాకు చాలా అవసరం. ఏది మంచి ఏది చెడు చక్కగా వివరించి చెబుతారు. అది చాలా బాగుంటుంది. వ్యక్తిగతంగా అందరికంటే విజయ్ దేవరకొండ ఎక్కువగా సపోర్ట్ చేశాడు” అని అన్నారు.

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన ప్రేమించుకుంటున్నారనే వార్తల నేపథ్యంలో స్టార్ లేడీ లేటెస్ట్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు ఈ ఏడాది వీరిద్దరి పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ఫిబ్రవరిలో నిశ్చితార్థం అన్నారు. ఈ వార్తలను విజయ్ దేవరకొండ ఖండించారు. మీడియా ప్రతి రెండేళ్లకు నాకు పెళ్లి చేయాలని చూస్తుంది. నా చుట్టూ తిరుగుతూ కనిపిస్తే పెళ్లి పీటలు ఎక్కించాలని చూస్తున్నారని, ఇలాంటి పుకార్లు నాపై వస్తూనే ఉన్నాయి.. అని అసహనం వ్యక్తం చేశారు

విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి రెండు చిత్రాలు చేశారు. వీరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం గీత గోవిందం బ్లాక్ బస్టర్ కొట్టింది. డియర్ కామ్రేడ్ మూవీలో మరోసారి జతకట్టారు. వీరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరూ తరచుగా కలిసి విహారాలకు వెళ్లడం, ముంబైలో డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేయడం చూసి ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పొచ్చు. ఆ ఇంట్లో జరిగే ప్రతి చిన్న వేడుకకు హాజరవుతుంది.

RELATED ARTICLES

Most Popular