Ranu Bombayiki Ranu Song 800 Million Views: ఈ మధ్యకాలంలో సినిమా పాటలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జానపద పాటలైతే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా పాటల కంటే జానపద పాటలకే ఎక్కువ క్రేజ్ రావడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి క్రమంలోనే రాము రాథోడ్ స్వయంగా తనే రాసి పాడిన ‘రాను బొంబాయికి రాను’ అనే పాట 2025 లో రిలీజ్ అయింది.
ఈ పాట చాలా వైరల్ గా మారడమే కాకుండా ప్రతి ఒక్క సెలబ్రిటి ని సైతం ఈ పాట మీద రీల్స్ చేయడం వల్ల ఈ సాంగ్ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇక దాంతోపాటుగా ఎక్కడ డీజే పెట్టిన కూడా ఈ పాటే మొదటగా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యూట్యూబ్ లో ఈ సాంగ్ కి 800 మిలియన్ల వ్యూస్ రావడం అనేది మామూలు విషయం కాదు. అంటే 80 కోట్ల మంది ఈ సాంగ్ ని చూశారన్నమాట…
సినిమా పాటల్లో ‘అలా వైకుంఠపురం లో’ ‘బుట్ట బొమ్మ’ సాంగ్ అత్యధిక వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుంటే జానపద పాటల్లో ఈ సాంగ్ 800 మిలియన్ల వ్యూస్ ని మూటగట్టుకొని మరింత సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుంది. 1000 మిలియన్ల వ్యూస్ ని అందుకోవడమే ఈ సాంగ్ టార్గెట్ గా మనకు తెలుస్తుంది. ఇప్పటికి ఈ సాంగ్ కి భారీ వ్యూస్ అయితే పడుతున్నాయి…
ఒక్క సాంగ్ తో పాపులారటిని సంపాదించుకున్న రాము రాథోడ్, బిగ్ బాస్ సీజన్ 9 లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా తను ప్రేక్షకులను మెప్పించాడు. రీసెంట్ గా వచ్చిన ‘బ్యాండ్ మేళం’ సినిమాలో సైతం ఒక పాటకు తనే ఆడి పాడడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా జానపద ఇండస్ట్రీ సైతం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దీటుగా ముందుకు దూసుకు రావడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
నిజానికి రాము రాథోడ్ ఎవరు ఫోక్ ఇండస్ట్రీ లో ఇంతటి గుర్తింపు పొందటానికి కారణమేంటి అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది అసక్తి చూపిస్తున్నారు…. రాము రాథడ్ మహబూబ్ నగర్ జిల్లా బూత్ పూర్ మండలం గోపాలపూర్ తండా కి చెందినవాడు. చిన్నప్పటి నుంచి సంగీతం, డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న రాము మొదట్లో పెళ్లి భారత్ లలో డాన్స్ లు వేసేవాడు…అలా డ్యాన్స్ అంటే ఇష్టమున్న తను కొన్ని రాజకీయ పార్టీల ప్రచారాల్లో కూడా ఆడి పాడాడు… మొత్తానికైతే ఫోక్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సింగర్ గా మారాడు… ప్రస్తుతం ఫోక్ ఇండస్ట్రీ ని షేక్ చేసే సాంగ్స్ చేస్తున్నాడు…