Homeబిజినెస్Simple Energy Electric Scooter: అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు 'సింపుల్ ఎనర్జీ' కొత్త ప్లాన్..

Simple Energy Electric Scooter: అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ‘సింపుల్ ఎనర్జీ’ కొత్త ప్లాన్..

Simple Energy Electric Scooter: ప్రస్తుతం చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లకు మారుతున్నారు. రోజువారి వినియోగదారులతో పాటు కొంతమంది యూత్ సైతం వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అయితే మొదట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పై కాస్త ఆందోళన వాతావరణం ఉండేది. కానీ ఆ తర్వాత వీటిపై ఎక్కువగా అవగాహన ఏర్పడుతుండడంతోపాటు తక్కువ ధరలోనే అందుబాటులో ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు వారికి అనుగుణంగా కొత్త కొత్త […]

Simple Energy Electric Scooter: ప్రస్తుతం చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లకు మారుతున్నారు. రోజువారి వినియోగదారులతో పాటు కొంతమంది యూత్ సైతం వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అయితే మొదట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పై కాస్త ఆందోళన వాతావరణం ఉండేది. కానీ ఆ తర్వాత వీటిపై ఎక్కువగా అవగాహన ఏర్పడుతుండడంతోపాటు తక్కువ ధరలోనే అందుబాటులో ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు వారికి అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా సింపుల్ ఎనర్జీ అనే కంపెనీ ఓ కొత్త స్కూటర్ ను పరిచయం చేయబోతుంది. ఇది మైలేజ్ విషయంలో రైడర్లకు ఫుల్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఈ స్కూటర్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం..

బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ అనే కంపెనీ ఇప్పటివరకు వన్, వన్ ప్లస్ అనే స్కూటర్లను రోడ్లపై తిప్పుతోంది. అయితే వినియోగదారులు అప్డేట్ కావడంతో వారికి అనుగుణంగా సరికొత్త స్కూటర్ ను పరిచయం చేయాలని అనుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ కొత్త మోడల్ ను పరీక్షిస్తుంది. సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కు అరైవ్ అని పేరు పెట్టినట్లు ఇంటర్నెట్ ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు.

ఈ స్కూటర్ రోజువారి వినియోగదారులతోపాటు యూత్ కూడా ఎక్కువగా వినియోగించడానికి అనుగుణంగా ఉంది. ముఖ్యంగా దీని మైలేజ్ విషయంలో ప్రత్యేకంగా చర్చ సాగుతుంది. ఒకసారి దీనిని చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఉన్నవారు సైతం దీనిని కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే దీన్ని సీటింగ్ వెడల్పుగా ఉండి సౌకర్యవంతంగా ఉండనుంది. లాంగ్ డ్రైవ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. డిజిటల్ డిస్ప్లే తో పాటు.. రైడర్లకు సేఫ్టీ గా ఉండేందుకు బ్రేకింగ్ సిస్టం ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది. అలాగే మొబైల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కూడా ఉండనున్నాయి.

ఇది మార్కెట్లోకి వస్తే రూ. ఒక లక్షతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చినా కూడా వాటిని లక్షకు పైగానే విక్రయిస్తున్నారు. మరికొన్ని స్కూటర్లు లక్షలోపు ఉన్నా కూడా అవి కొంతమంది వినియోగదారులను ఆకట్టుకోలేక పోతున్నాయి. అయితే సింపుల్ ఎనర్జీకి సంబంధించిన ఈ కొత్త స్కూటర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper